పిఎంఇండియా
పౌర విమానయాన రంగంలో సహకారానికి సంబంధించిన అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు) పై భారతదేశం, జర్మనీ లు సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. పౌర విమానయాన రంగంలో సహకారానికి భారతదేశం, జర్మనీ ల అంగీకారానికి సంబంధించిన సంయుక్త ప్రకటన గా దీనిని పేర్కొన్నారు. భారతదేశం, జర్మనీల మధ్య సురక్షితమైన సమర్థమైన విమాన ప్రయాణ వ్యవస్థ అభివృద్ధి కి ఈ సంయుక్త ప్రకటన ఉపకరించనుంది. పరస్పర అంగీకారానికి సంబంధించి సంయుక్త ప్రకటన రూపంలో గల ఈ ఒప్పందం భారతదేశానికి, జర్మనీ కి మధ్య పౌరవిమానయాన రంగ సంబంధాలలో కీలక మలుపు కానుంది. ఇది రెండు దేశాల మధ్య మరింత వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటక అభివృద్ధి, సాంస్కృతిక మార్పిడులకు అవకాశం కల్పించనుంది. ఈ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయడం ద్వారా విమానయాన రంగంలో గల అనుభవాన్ని, విజ్ఞానాన్ని పరస్పరం అందిపుచ్చుకోవాలని, ఇప్పటికే ఉభయ దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలూ ఆకాంక్షిస్తున్నాయి.
ఈ కింది రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించడం ఈ సంయుక్త ఒప్పందం ప్రధాన లక్ష్యం.
(i) విమానయాన సంబంధి భద్రత, ఎయర్ ట్రాఫిక్ నిర్వహణ
విమానయాన భద్రతకు సంబందించిన ఉత్తమ విధానాలను, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం,ఎయర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ తో సహా భద్రత కు సంబంధించిన వివిధ అంశాలపై సదస్సులను, సమావేశాలను, పర్యటనలను నిర్వహించడం ద్వారా తగిన ఆలోచనలు పంచుకోవడం.
(ii) హెలిపోర్టులు, హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు (హెచ్ఇఎంఎస్)
హెలిపోర్టులు, హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలకు సంబంధించిన సమాచారాన్ని, మెరుగైన పద్ధతులకు సంబంధిచిన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం.
(iii) నిబంధనలు మరియు విధానం
కీలక అంతర్జాతీయ అంశాలపై ఐసిఎఒ లో సహకారం కొనసాగింపు
(iv) కార్పొరేట్ ఏవియేషన్ ను మరియు బిజినెస్ ఏవియేషన్ ను అభివృద్ధి
వ్యాపార పరమైన, వాణిజ్యేతరమైనటువంటి విమానయానానికి సంబంధించిన సౌకర్యాల విషయంలో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం
(v) పర్యావరణం
(ఎ) పర్యావరణ హితకరమైన, సుస్థిరాభివృద్ధికి దోహదపడే విమానాశ్రయాల అభివృద్ధికి, ప్రణాళికలకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో పొరపాట్లకు సంబంధించిన అనుభవాలను పంచుకోవడం
(బి) జల వాయు పరివర్తనల సమస్య కు గల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ స్థాయిలో కలసి పనిచేయడం, ఆ రకగంగా విమానయాన రంగానికి సంబంధించి గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను దేశీయంగా అంతర్జాతీయ స్థాయిలో తగ్గించేందుకు కృషి చేయడం.
(vi) శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి
విమానయాన భద్రతకు సంబంధించిన లోటుపాట్ల విషయంలో సాంకేతికపరమైనటువంటి మరియు సాంకేతికేతర సంబంధి సహకారం, శిక్షణ విషయంలో భాగస్వామ్యాలను అన్వేషించడం.
***