Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజలు తన పట్ల చూపుతున్న ప్రేమకు, అందజేస్తున్న ఆశీస్సులకు కృతజ్ఞత‌లు తెలిపిన ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు తనంటే చూపుతున్న అభిమానానికి, తనకు అందజేస్తున్న ఆశీర్వాదాలకు ప్రధానమంత్రి కృతజ్ఞత‌లు తెలిపారు. కొన్ని భావాలు చాలా ప్రత్యేకమైనవిగా ఉంటూ, మనసును ఎంతో ప్రభావితం చేస్తాయని శ్రీ మోదీ అన్నారు. ‘ఆశీర్వాద్‌ కా దియా’ (ఆశీఃపూర్వక జ్యోతి) అలాంటి ఒక ప్రేమాస్పద అభివ్యక్తీకరణేనని ఆయన వర్ణిస్తూ, ఇది తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. ప్రతి ఆశీర్వచనం భారత్ ప్రజలకు మరింత ఎక్కువ అంకితభావంతో సేవలను అందించాలన్న తన సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘కొన్ని భావాలు చాలా ప్రత్యేకమైనవి.
అలాంటి అనురాగ వ్యక్తీకరణల్లో ఒకటి ‘ఆశీర్వాద్‌కాదియా’ (#AshirwadKaDiya).. ఇది నన్నెంతో ప్రభావితం చేసింది.
ప్రతి ఆశీస్సూ మన ప్రియ భారతదేశ పౌరులకు మరింత నిష్ఠాపూర్వకంగా సేవ చేయాలన్న నా సంకల్పాన్ని బలోపేతం చేస్తూ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.