పిఎంఇండియా
కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సుపరిపాలనకు ప్రజా విశ్వాసమే అతిపెద్ద మూలధనమని ఈ వ్యాసం పేర్కొంది. గత 12 ఏళ్లలో దేశంలో వచ్చిన మార్పులు.. పరిపాలనపై ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేయడమే కాకుండా, వివిధ సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మంది పౌరుల జీవితాలను మరింత సులభతరం, సురక్షితం, గౌరవప్రదంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయని ఇందులో వివరించారు. ఈ అభివృద్ధి పరిణామాలు, పౌరులపై వాటి ప్రభావం గురించి ఈ వ్యాసం తెలియజేస్తుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ప్రజా విశ్వాసమే సుపరిపాలనకు అత్యంత పెద్ద మూలధనం. గత 12 సంవత్సరాల్లో వచ్చిన మార్పులు పరిపాలన పట్ల ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేయడంలో విజయవంతం అవ్వడమే కాకుండా, ప్రజా సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది పౌరుల జీవితాలను మరింత సులభతరంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ వ్యాసంలో తన అభిప్రాయాలను వివరంగా పంచుకున్నారు’‘.
जन विश्वास ही सुशासन की सबसे बड़ी पूंजी है। बीते 12 वर्षों में हुए परिवर्तन न केवल शासन-प्रशासन के प्रति लोगों का भरोसा मजबूत करने में सफल रहे हैं, बल्कि जनकल्याणकारी योजनाओं के माध्यम से करोड़ों नागरिकों के जीवन को अधिक सहज, सुरक्षित और सम्मानजनक बनाने में भी महत्वपूर्ण भूमिका… https://t.co/8C8iK5B8eI
— PMO India (@PMOIndia) June 22, 2026