పిఎంఇండియా
ప్రతి లక్ష్యాన్ని సాధించడంలో అంకితభావానికీ, సంకల్పంతో కూడిన ప్రయత్నానికీ ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘ప్రభూతం కార్యమల్పం వా యన్నరః కర్తుమిచ్ఛతి।
సర్వారంభేణ తత్ కార్యం సింహాదేకం ప్రచక్షతే।।’’
దేశంలో తొలి హైడ్రోజన్ రైలును వాస్తవరూపంలోకి తీసుకురావాలన్న భారత్ కల నిజమైందని ప్రధానమంత్రి అన్నారు. శుద్ధమైన, పర్యావరణహిత, భవిష్యత్తు అవసరాలకు తగిన రవాణా వ్యవస్థను నిర్మించడంలో దేశం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సాధించిన ముఖ్యమైన విజయంగా ఈ ఘట్టాన్ని ప్రధానమంత్రి వర్ణించారు. ఈ చిరస్మరణీయ విజయంలో భాగస్వాములైన వారందరినీ అభినందించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:
భారతదేశానికి తొలి హైడ్రోజన్ రైలు లభించాలనే కల ఈ రోజు సాకారమైంది. ఆత్మనిర్భర భారత్, స్థిరమైన అభివృద్ధి దిశగా చేస్తున్న ప్రయాణంలో ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ ఘన విజయంలో భాగమైన వారందరికీ నా అభినందనలు
ప్రభూతం కార్యమల్పం వా యన్నరః కర్తుమిచ్ఛతి।
సర్వారంభేణ తత్ కార్యం సింహాదేకం ప్రచక్షతే।।
***
आज भारत को पहली हाइड्रोजन ट्रेन मिलने का सपना साकार होने जा रहा है। यह आत्मनिर्भर भारत और सतत विकास की दिशा में एक बहुत बड़ा दिन है। मैं इससे जुड़े सभी लोगों को बहुत बधाई देता हूं।
— Narendra Modi (@narendramodi) July 17, 2026
प्रभूतं कार्यमल्पं वा यन्नरः कर्तुमिच्छति।
सर्वारम्भेण तत् कार्यं सिंहादेकं प्रचक्षते।। pic.twitter.com/aAbVNt9GCb