Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించే వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మహిళా సాధికారత, స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించడంలో కలిగిన విప్లవాత్మక మార్పులను వివరిస్తూ కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు.

 

ఈ పథకం ద్వారా మహిళలను కేవలం లబ్ధిదారులుగా మాత్రమే చూడకుండా, విధాన రూపకల్పనలో వారిని ప్రాథమిక బిందువుగా పరిగణించే ఒక గొప్ప మార్పును ఈ వ్యాసం వివరిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఒక ప్రధాన మార్పునకు నాంది పలికిందని, ఇందులో మహిళలను కేవలం విధాన లబ్ధిదారులుగా కాకుండా… ఆ విధానానికి మూల బిందువుగా చూస్తున్నారని కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ తన వ్యాసంలో రాశారు.

 

ఈ కార్యక్రమం ఎల్‌పీజీ పరిధిని విస్తరించడమే కాకుండా… 10 కోట్లకు పైగా మహిళలకు నేరుగా సబ్సిడీ బదిలీని సాధ్యం చేసింది. స్వచ్ఛమైన వంట ఇంధనం వైపు మళ్లడం వల్ల గృహాల్లో వాయు కాలుష్యం తగ్గడమే కాక, ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పుడు మా దృష్టి నిరంతర వినియోగం, తక్కువ ఖర్చు, ఇంధన న్యాయాన్ అందరికీ అందించడంపై ఉంది.

 

ఈ ఆలోచనాత్మక వ్యాసాన్ని తప్పక చదవండి!’’