Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన జర్మనీ ఛాన్సలర్‌


జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ ఛాన్సలర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్‌ చేశారు.

భారత్‌ – జర్మనీ దేశాలు ఈ ఏడాది దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ భారత్‌–జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఉన్నతస్థాయిలో పరస్పర పర్యటనలు, చర్చల్లో కొనసాగుతున్న పురోగతిని వారు గుర్తించారు. వాణిజ్యం, పెట్టుబడులు, అధునాతన సాంకేతికతలు, స్వచ్ఛ ఇంధనం, రక్షణ, విద్య, ప్రతిభావంతుల రాకపోకలు వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్న తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

రెండు దేశాలకూ పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరత, సుసంపన్నతను ప్రోత్సహించేందుకు సన్నిహితంగా కలిసి పనిచేయడం కొనసాగించాలని నిర్ణయించారు.  

 

***