Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానితో శ్రీ టెడ్ సరండోస్ భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నెట్‌ఫ్లిక్స్ కో సీఈవో శ్రీ టెడ్ సరండోస్ ఈ రోజు భేటీ అయ్యారు. సుసంపన్నమైన కథన సంప్రదాయం, అసాధారణ సృజనాత్మక ప్రతిభా సంపద భారత్‌లో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుని కంటెంట్ సృజనలో అంతర్జాతీయ కేంద్రంగా దేశ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘శ్రీ టెడ్ సరండోస్‌ను కలవడం సంతోషంగా ఉంది. దేశ మీడియా, వినోద రంగాల సమర్థత, విస్తృతమైన అవకాశాలపై చర్చించాం.

సుసంపన్నమైన కథన సంప్రదాయమూ, అసాధారణ సృజనాత్మక ప్రతిభా సంపదా భారత్‌ సొంతం. వాటిని సద్వినియోగం చేసుకుని.. కంటెంట్ సృజనలో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేసుకుందాం’’ .