Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాని అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం: జీవన సౌలభ్యం, వాణిజ్య సౌలభ్యాలను పెంపొందించడంపై చర్చ


నిన్న ఫలప్రదంగా నిర్వహించిన మంత్రిమండలి సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.

జీవన సౌలభ్యం’, ‘వాణిజ్య సౌలభ్యా’లను పెంపొందించడానికి సంబంధించి విలువైన ఆలోచనలుఅత్యుత్తమ పద్ధతులపై మంత్రిమండలి చర్చించిందని ప్రధానమంత్రి తెలిపారుమనందరి స్వప్నమైన వికసిత భారత్‌ను విజయవంతంగా సాకారం చేసుకునే దిశగా.. ప్రభావవంతంగా సంస్కరణలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయమై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించినట్టు ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘నిన్న మంత్రివర్గ సమావేశం ఫలప్రదంగా జరిగింది. ‘జీవన సౌలభ్యం’, ‘వాణిజ్య సౌలభ్యా’లను పెంపొందించడానికి సంబంధించి వివిధ ఆలోచనలనుఅత్యుత్తమ విధానాలతోపాటు.. మనందరి స్వప్నమైన వికసిత భారత్‌ను సాకారం చేసుకునే దిశగా సంస్కరణలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంపై మేం చర్చించాం.’’

 

****