Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాని దృష్టికికి కార్యదర్శుల బృందం సూచనలు, సలహాలు

ప్రధాని దృష్టికికి కార్యదర్శుల బృందం సూచనలు, సలహాలు


పరిపాలనలో వేరు వేరు అంశాలలో సమూల మార్పులు తీసుకు రావడం కో్సం తగిన సూచనలు, సలహాలతో ముందుకు రావాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అందుకొని కార్యదర్శుల బృందమొకటి ‘స్వస్థ్ భారత్- శిక్షిత్ భారత్’ అనే అంశంపై తమ ఆలోచనలను ప్రధానితో పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ రాజ్ నాథ్ సింగ్, శ్రీ మనోహర్ పారికర్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ శ్రీ అరవింద్ పాన్ గఢియా లు కూడా పాల్గొన్నారు. కార్యదర్శుల బృందం ఇచ్చిన ప్రెజెంటేషన్ ముగిసిన తరువాత సభికులలో పలువురు ఇదే అంశంపై తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఇంతవరకు కార్యదర్శులతో కూడిన నాలుగు బృందాలు తమ ప్రెజెంటేషన్ లను ప్రధాన మంత్రికి సమర్పించాయి.

*****