Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాని దృష్టికి కార్యదర్శుల ఒకటవ బృందం సూచనలు, సలహాలు

ప్రధాని దృష్టికి కార్యదర్శుల ఒకటవ బృందం సూచనలు, సలహాలు


పరిపాలనకు సంబంధించిన వేరు వేరు క్షేత్రాల‌లో తీసుకురాదగిన సమూల మార్పులతో ముందుకు రావలసిందని ప్రధాన మంత్రి చేసిన ఉద్బోధ కు అనుగుణంగా కార్యదర్శుల ఒకటవ బృందం (మొత్తం 8 బృందాలున్నాయి)
శక్తిని పొదుపుగా, సమర్థంగా వినియోగించుకోవడం ( ఎన‌ర్జీ క‌న్స‌ర్వేష‌న్ ) అనే
అంశంపైన తమ ఆలోచనలను, సలహాలను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి నివేదించింది.

ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇంకా కేంద్ర మంత్రులు శ్రీ రాజ్ నాథ్ సింగ్, శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీమతి సుష్మ స్వరాజ్, నీతి
ఆయోగ్ వైస్ ఛైర్మన్ శ్రీ అరవింద్ పాన్ గఢియా లతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యద
ర్శులు అందరూ పాలు పంచుకొన్నారు. సమావేశంలో ప్రతిపాదనలు, సూచనలపై
ప్రదర్శన కొనసాగుతున్నప్పుడు, ప్రదర్శన ముగిసిన తరువాత సభికులలో ప్రధాని సహా పలువురు ఆయా అంశాలపైన ప్రశ్నలు అడిగారు. దీంతో పాటు తమ సలహాలు కూడా చెప్పారు.

కార్యదర్శుల బృందం సమర్పించిన నివేదికను ప్రధాని మెచ్చుకున్నారు. తాను అనుకున్న దానితో చాలా వరకు దగ్గరగా ఉండేటట్లుగా ఆ నివేదికను రూపొందించి, కార్యదర్శులు వారి పనిని ఎంతో సమర్ధంగా నెరవేర్చారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వారి సందేహాలు నివృత్తి చేసుకున్న‌/ ఆలోచనలను పంచుకున్న అందరినీ ప్రధాని అభినందించారు.

***