పిఎంఇండియా
ప్రెసిడెంట్ శ్రీ ఒబామా,
మీడియా సభ్యులు,
అమెరికా అధ్యక్షుడు శ్రీ ఒబామాను న్యూయార్క్ లో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు అందరికీ అభినందనలు.
భారత్, అమెరికాల సంబంధాలు మరింత దృఢం కావడానికిగాను మీకున్న ముందు చూపు, నిబద్ధతలు మీతో మాకున్న స్నేహం అమూల్యమైనవి.
అంతర్జాతీయ భాగస్వామ్యంలోనూ, రెండు దేశాల మధ్యన గల ద్వైపాక్షిక సంబంధాల్లోనూ మనం గణనీయమై ప్రగతిని సాధించాం.
గత వారాంతంలో నేను సిలికాన్ వ్యాలీలో ఉన్నాను. అక్కడ నేను అమెరికా విజయ పునాదిగా నిలిచిన సృజనాత్మకతను, వ్యాపార దక్షతను దగ్గరగా గమనించాను. అవగాహన చేసుకున్నాను.
రెండు దేశాల సంబంధాలను ముందుకు తీసుకుపోతున్న బలీయమైన శక్తి ఏంటో కూడా చూశాను. యువత, సాంకేతికత, సృజనాత్మకతల కలయికే ఆ బలీయమైన శక్తి.అంతే కాదు మానవాభివృద్ధికి దోహదం చేస్తున్న భారతీయుల, అమెరికన్ల భాగస్వామ్యాల గురించి తెలుసుకున్నాను.
కాలిఫోర్నియా (సిలికాన్ వ్యాలీ) నాకు మరో విషయాన్ని గుర్తు చేసింది. అది భారత్ , అమెరికా రెండూ ఆసియా పసిఫిక్ ప్రాంత అభివృద్ధిలో భాగం కావడం ఆనందించదగ్గ పరిణామం.
ప్రస్తుతం ప్రపంచం ముందున్న సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో ఇరు దేశాల భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యత ఉంది. అది రెండు దేశాలకే కాదు మొత్తం ప్రపంచానికి కూడా ప్రాధాన్యతగల అంశం.
సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి సృజనాత్మకతను, సాంకేతికతను ఉపయోగించాలి. అంతే కాదు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, పర్యావరణ పరిరక్షణకు కూడా వాటిని వినియోగించాలి.
వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి రాజీలేని నిబద్ధతతోతో పని చేయాలని నేను, ప్రెసిడెంట్ శ్రీ ఒబామా నిశ్చయించాము. అదే సమయంలో అభివృద్ధి విషయంలో మానవీయ ఆకాంక్షలకు ఎలాంటి నష్టం జరగకుండా పని చేయాలనుకున్నాం. ఉన్నతమైన జాతీయ కార్యాచరణను ఇద్దరం సిద్ధం చేశాం.
ఈ విషయంలో భారత దేశం అనేక విధాలుగా ఆలోచిస్తూ ముందడుగు వేస్తోంది. 2022 నాటికి 175 జిడబ్ల్యు పునర్ వినియోగ శక్తిని కొత్తగా తయారు చేసుకోవాలనే కార్యాచరణతోపాటు సుస్థిర ఇంధన సామర్థ్యాన్ని సంపాదించుకోవడానికి అవసరమయ్యే అభివృద్ధి వ్యూహాన్ని తయారు చేసుకుంటున్నాం. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని మేం ఈ పని చేస్తున్నాం. అంతేకాదు ప్రపంచ భవిష్యత్ పట్ల మాకున్న నిబద్ధతను కూడా మేం మరిచిపోవడం లేదు.
రెండు దేశాల మధ్యన ఇంధన రంగంలో అసాధారణమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయి. ఇవి పరిశుభ్రమైన, పునర్ వినియోగ ఇంధనం, ఇంధన సామర్థ్యాలపైన దృష్టిపెట్టాయి.
అందరికీ అందుబాటులోకి వచ్చే ఆరోగ్యకరమైన ఇంధన వనరులకోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యాన్ని కోరుదామంటూ నేను చెప్పగానే ప్రెసిడెంట్ శ్రీ ఒబామా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్పందించారు. అందుకుగాను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాను.
ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనం కలిసి పని చేయాలి. అన్ని వర్గాలవారికి ఇంధన వనరులు అందుబాటులోకి తెచ్చే వ్యవస్థలను అభివృద్ధి చేయడం కూడా ఈ సందర్భంగా చాలా ముఖ్యం.
పారిస్లో జరగబోతున్న సమావేశం తర్వాత వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికిగాను సమగ్రమైన, దృఢమైన కార్యాచరణ రూపొందుతుందని మేం అనుకుంటున్నాం. అంతే కాదు ఆ సమావేశం అభివృద్ధి చెందుతున్న దేశాలకు కావలసిన సాంకేతికత, ఆర్థిక సాయం అంశాలపై దృష్టి పెడుతుందని భావిస్తున్నాం. ఇది ముఖ్యంగా పేద దేశాలకు, చిన్న ద్వీప దేశాలకు చాలా ముఖ్యం.
సంస్కరణ తర్వాత ఏర్పడబోయే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇచ్చే విషయంలో అమెరికా మద్దతు తెలిపినందుకు ప్రెసిడెంట్ శ్రీ ఒబామాకు కృతజ్ఞతలు తెలియజేశాను. నిర్ణీత సమయంలోగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలు జరగాలనే నా ఆకాంక్షకు అమెరికా మద్దతు కావాలంటూ ఈ సమావేశంలో నేను కోరాను.
అంతర్జాతీయ ఎగుమతి నియంత్రిత వ్యవస్థల్లో సభ్యత్వంకోసం అమెరికా నిరవధిక మద్దతు తెలిపింది. ఇదే విషయాన్ని ప్రెసిడెంట్ శ్రీ ఒబామా ముందు ప్రస్తావించి అభినందనలు తెలిపాను.
అనేక వ్యూహాత్మక, భద్రతాపరమైన సమస్యలను ఇరుదేశాల భాగస్వామ్యం అధిగమించగలదు.
రక్షణ పరంగా ముఖ్యంగా రక్షణ రంగంలో వ్యాపారం, శిక్షణ విషయాల్లో ఇరు దేశాల సహకారం మరింత విస్తృతమవుతోంది. ఇప్పటికే మన ముందున్న ఉగ్రవాద సవాళ్లు రోజు రోజుకు పెరుగుతుండడం, మరోవైపు కొత్త కొత్త ఉగ్రవాద సమస్యలు ఉత్పన్నమవుతుండడంతో వీటిని ఎదుర్కోవడంలో ఇరుదేశాల సహకారాన్నిమరింత బలోపేతం చేయాలని నిర్ణయిం తీసుకన్నాం. సైబర్ సెక్యూరిటీని సాధించడానికి ఏం చేయాలో సమగ్రంగా చర్చించాం.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆప్ఘాన్ దేశానికి ఇరు దేశాలు సాయం చేస్తున్నాయి. ఈ సాయం మరింత బలోపేతం చేయాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. దీనివల్ల ఆప్ఘాన్ దేశానికి సుస్థిరమైన, అభివృద్ధికరమైన భవిష్యత్ లభిస్తుంది.
ఆసియా, పసిఫిక్, ఇండియన్ ఓషియన్ ప్రాంతాల్లో రెండు దేశాలు ఉమ్మడిగా వ్యూహాత్మక ముందుచూపుతో పని చేస్తున్నాయి. ఈ విషయంలో జరుగుతున్న అభివృద్ధిని నేను స్వాగతించాను. జపాన్ లాంటి దేశాలతో ఇరు దేశాలకు గల ఉమ్మడి సంబంధాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉమ్మడి భాగస్వామ్యంవల్ల సముద్ర జలాల భద్రతా సహకారం మరింతగా దృఢతరమవుతుంది.
ఈ ప్రాంతంలో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెరగానికిగాను ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కమ్యూనిటీలో భారతదేశానికి సభ్యత్వం కావాలి. ఇందుకుగాను అమెరికాతో కలిసి పని చేయాలని భావిస్తున్నాను.
ఇరు దేశాల సంబంధాలను ముందుకు తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తన్నది ఆర్థికంగా రెండు దేశాలకున్న భాగస్వామ్యమే. న్యూయార్క్, శాన్జోస్ నగరాల్లో ఆర్థిక రంగ దిగ్గజాలతో పలు ఫలప్రదమైన సమావేశాలు నిర్వహించాను. వారు భారతదేశంపట్ల వ్యక్తం చేసిన ధీమాను చూసి సంతోషిస్తున్నాను. వారు ఈ సందర్భంగా నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఆర్థిక సహకారం విషయంలో దృఢమైన దైపాక్షిక వ్యవస్థకోసం ఇరు దేశాలు నిరంతరం పని చేస్తూనే ఉంటాయి. బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అండ్ టోటలైజేషన్ అగ్రిమెంట్ కుదరడానికి వీలుగా ఇరుదేశాలు ఈ పనిని కొనసాగిస్తూనే ఉంటాయి.
ప్రెసిడెంట్ శ్రీ ఒబామాతో జరిగిన సమావేశంతోపాటు అమెరికాలో నేను పాల్గొన్న పలు కార్యక్రమాలు ఇరు దేశాల మధ్యనగల అసాధారణమైన, వైవిధ్యమైన సంబంధాలకు దర్పణంగా నిలుస్తాయి.
ఇరు దేశాల మధ్యన ఇప్పటికిప్పుడు చేపట్టాల్సిన కార్యక్రమాలు రూపు దాల్చడానికి, సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికీ ఈ సమావేశం కీలకమైనది.
థ్యాంక్ యూ.
I thanked President Obama for U.S. support for India's permanent membership of a reformed UN Security Council: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2015
Our partnership addresses a broad range of strategic and security concerns: PM @narendramodi https://t.co/tv6LVAraUe
— PMO India (@PMOIndia) September 28, 2015
My meeting with @POTUS focussed on advancing some of our immediate priorities & our broader strategic partnership. pic.twitter.com/H3CkoEzvEH
— NarendraModi(@narendramodi) September 28, 2015
During the meeting, @POTUS & I discussed trade, climate change, energy & defence cooperation. http://t.co/oeg59d4Ct2 @WhiteHouse
— NarendraModi(@narendramodi) September 28, 2015