Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రితో ప్రముఖ ముస్లిముల ప్రతినిధి బృందం భేటీ

ప్రధాన మంత్రితో ప్రముఖ ముస్లిముల ప్రతినిధి బృందం భేటీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ప్రముఖ ముస్లిముల ప్రతినిధి బృందమొకటి ఈ రోజు భేటీ అయింది. ఈ ప్రతినిధి బృందం సభ్యులలో షియా మత గురువు మౌలానా కల్బే జవ్వాద్; అంతర్జాతీయ ఇస్లామిక్ వ్యవహారాల నిపుణుడు శ్రీ కమర్ ఆఘా; ఇంకా శ్రీ షాహిద్ సిద్దికీ, తదితరులు ఉన్నారు.

ప్రధాన మంత్రి ఇటీవల సౌదీ అరేబియాలో జరిపిన పర్యటన విజయవంతంగా ముగించుకు వచ్చినందుకు ప్రతినిధి బృందం సభ్యులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా లలో ప్రజలు, ప్రత్యేకించి యువతీయువకులు శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు అమితంగా ప్రభావితులు అయ్యారని, భారతదేశంతో సత్సంబంధాలను కలిగి ఉండాలని కోరుకొంటున్నారని ప్రతినిధి బృందం సభ్యులు పేర్కొన్నారు.

శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, వాటిని విజయవంతంగా అమలు చేయడంలో నెలకొల్పుతున్న ప్రమాణాలను ప్రతినిధి బృందం సభ్యులు కూడా ప్రశంసించారు.

ప్రతినిధివర్గానికి ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. దేశ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్లు, విద్యారంగం పైన.. మరీ ముఖ్యంగా ఆడ పిల్లల విద్య పైన ప్రత్యేక శ్రద్ధను తీసుకొంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఎన్ డి ఎ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, ఇంకా ముద్ర యోజన వంటి సంక్షేమ పథకాల నుంచి భారతదేశంలోని ముస్లిం సమూహం భారీ ప్రయోజనాలు పొందగలగాలంటూ ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

***