Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రిని కలుసుకున్న కొరియా సీఈఓ లు

ప్రధాన మంత్రిని కలుసుకున్న కొరియా సీఈఓ లు


రిపబ్లిక్ ఆఫ్ కొరియా కు చెందిన సీనియర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈఓ లు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వారు ఇండో-కొరియా బిజినెస్ సమిట్ లో పాలు పంచుకోవడానికి ప్రస్తుతం న్యూఢిల్లీకి విచ్చేశారు.

ఇరు దేశాల మధ్య వ్యాపారపరమైన సహకారాన్ని పెంపొందించుకొనేందుకు ఉన్న అవకాశాలను గురించి వారు ఈ సందర్భంగా చర్చించారు. కొరియా బ్రాండ్ లను భారతదేశంలో ఇంటిల్లిపాదికీ ప్రియమైన బ్రాండ్ లుగా మార్చినవి కొరియా పారిశ్రామిక రంగం అవలంబిస్తున్న నైతిక ప్రమాణాలతో పాటు, వృత్తి నైపుణ్యమే అంటూ ప్రధాని కొనియాడారు.

భారతదేశంలో కొరియా కంపెనీలు వాటి పెట్టుబడులను పెంచాలంటూ ప్రధాని అందుకు వాటికి ఆహ్వానం పలికారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతం అందించాలని, “మేక్ ఇన్ ఇండియా” కు మరో అర్థం “మేక్ ఫర్ ఇండియా” అని కూడా సూచించారు. కొరియాలోని ప్రధాన కంపెనీలు కొరియా లో అనుసరిస్తున్న నమూనా తరహాలోనే భారతదేశంలోనూ ఒక గ్రూపుగా ఏర్పడి పెట్టుబడులు పెట్టడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని ప్రధాని సలహా ఇచ్చారు.

****