పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమెరికా సంయుక్త రాష్ట్రాల రక్షణ శాఖ మంత్రి శ్రీ ఎష్టన్ బి. కార్టర్ కు సాదరంగా స్వాగతం పలికారు. ఉభయ దేశాల మధ్య రక్షణ రంగ సహకారం పురోగమిస్తుండటం పట్ల ప్రధాన మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో తాను ప్రతిపాదించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో పాటే ఈ రెండు దేశాల మధ్య ద డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ స్వరూపంపై చర్చలు ముందుకు సాగుతాయన్న ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు.
భారతదేశాన్ని సన్నిహిత మిత్ర దేశం గాను, చిరకాల భాగస్వామి గాను యు ఎస్ చూస్తున్నదని యు ఎస్ రక్షణ మంత్రి శ్రీ ఎష్టన్ బి. కార్టర్ ప్రధాన మంత్రితో పేర్కొన్నారు. ఇరు పక్షాలు కొనుగోలుదారు-అమ్మకందారు అనే సంబంధం నుంచి తయారీలో భాగస్వామ్యం దిశగా పయనిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇరువురు నేతలు ఆసియా పసిఫిక్ ప్రాంతం, దక్షిణాసియా లు సహా ప్రాంతీయ స్థితిగతులపై ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలియజెప్పుకొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కార్టర్ యు ఎస్ అవలంబిస్తున్న ‘రీబ్యాలెన్స్’ విధానం, భారతదేశం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానం ఒకదానిని మరొకటి కొనియాడదగినవిగా ఉన్నాయన్నారు.
‘