Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి ని కలుసుకొన్న ఫ్రాన్స్ పూర్వ అధ్యక్షుడు శ్రీ నికొలస్ సర్కోజి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఫ్రాన్స్ పూర్వ అధ్యక్షుడు శ్రీ నికొలస్ సర్కోజి ఈ రోజు కలుసుకొన్నారు.

శ్రీ సర్కోజి రచించిన పుస్తకం “లా ఫ్రాన్స్ పోర్ లా వాయీ” ఇటీవల ప్రచురింపబడి, పాఠకాదరణకు నోచుకోవడం పట్ల ఆయనకు ప్రధాన మంత్రి అభినందనలు తెలియజేశారు.

ప్యారిస్, పఠాన్ కోట్, బ్రసెల్స్, ఇంకా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులను ప్రధాన మంత్రి, శ్రీ సర్కోజి ఖండించారు. ఉగ్రవాదుల బెదిరింపులను తుదముట్టించడానికి ప్రపంచమంతా ఒక్కటై నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని వారు ఉభయులు పిలుపునిచ్చారు.

కిందటి ఏడాది ప్యారిస్ లో సి ఒ పి-21 శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావడంలో భారతదేశం సకారాత్మక భూమికను పోషించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి శ్రీ సర్కోజి అభినందనలు తెలియజేశారు.