Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి నేడు గుజరాత్ లో పర్యటించనున్నారు; గాంధీనగర్ లో మంగళవారం ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు వార్షిక సమావేశాలకు ఆయన హాజరు కానున్నారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నుండి రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు.

ప్రధాన మంత్రి ఈ రోజు కచ్ఛ్ లో వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభించనున్నారు, అంతే కాక వేరు వేరు పథకాలకు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు.

మే నెల 23వ తేదీ మంగళవారం నాడు గాంధీనగర్ లో ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు వార్షిక సమావేశాల ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొననున్నారు.

ప్రధాన మంత్రి గుజరాత్ లో తన రెండు రోజుల పర్యటన వివరాలను గురించి ట్విటర్ లో వరుస ట్వీట్ ల ద్వారా తెలియజేశారు.

‘‘గుజరాత్ లో నా రెండు రోజుల పర్యటన ను రేపు మొదలుపెట్టబోతున్నాను. ఈ పర్యటనలో భాగంగా కచ్ఛ్ లోను, గాంధీనగర్ లోను జరిగే కార్యక్రమాలలో నేను పాల్గొంటాను.

కాండ్లా పోర్టు కు చెందిదన వివిధ ప్రాజక్టులకు నేను ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయవలసి ఉంది. ఆ తరువాత గాంధీధామ్ లో జరిగే ఒక బహిరంగ సభలో నేను పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తాను.

భచవూ లో ఒక పంపింగ్ స్టేషన్ ను ప్రారంభిస్తాను. ఒక బహిరంగ సభలో నూ పాల్గొంటాను. దీనిని మీరు మీ మొబైల్ ఫోన్ లో http://nm4.in/dnldapp ద్వారా చూడండి.

నా హృదయం లో కచ్ఛ్ కు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడ అద్భుతమైన ప్రజలు ఉన్నారు. వారు చెప్పుకోదగినటువంటి పునరుద్ధరణపూర్వక స్ఫూర్తిని కలిగివున్నారు.

2001 లో సంభవించిన భూకంపం వ్లల ఊహించనలవి కాని విధ్వంసానికి గురైంది. కచ్ఛ్ ఇవాళ భారతదేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

మంగళవారం నేను ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం కోసం గాంధీనగర్ లో ఉంటాను.

ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు వార్షిక సమావేశాలకు – ‘‘ఆఫ్రికాలో సంపద వృద్ధి కోసం వ్యవసాయ పరివర్తన’’ అనేటటువంటి ఎంతో సముచితమైన ఇతివృత్తాన్ని ఎన్నుకోవడమైంది.

ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశాలకు హాజరవుతున్న కొంతమంది ప్రముఖ ప్రతినిధులను నేను కలుసుకుంటాను.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.