Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి రియో ఒలంపిక్స్ లో కాంస్యాన్ని గెల్చుకున్న సాక్షి మాలిక్ ను అభినందించారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రియో ఒలంపిక్స్ లో కుస్తీ లో కాంస్య పతకాన్ని గెల్చిన సాక్షి మాలిక్ ను అభినందించారు.

“సాక్షి మాలిక్ చరిత్రను సృష్టించారు. ఆమె కాంస్య పతకాన్ని సాధించినందుకు ఆమెకు ఇవే నా అభినందనలు. (ఈ విజయం పట్ల) యావత్తు దేశం సంతోషిస్తోంది.

రక్షా బంధన్ శుభ దినాన భారతదేశ పుత్రిక సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని గెల్చుకొని, మనందరం ఎంతో గర్వించేటట్లు చేశారు.

రానున్న సంవత్సరాలలో అనేక మంది క్రీడాకారులకు సాక్షి మాలిక్ స్ఫూర్తిమూర్తిగా నిలుస్తారు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***