Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ వస్తు ప్రదర్శనశాల రెండో దశను ప్రారంభించారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ వస్తు ప్రదర్శనశాల రెండో దశను ప్రారంభించారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ వస్తు ప్రదర్శనశాల రెండో దశను ప్రారంభించారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి భవన్ వస్తు ప్రదర్శనశాల రెండో దశను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి శ్రీ హమీద్ అన్సారీ, ఇంకా ఇతర ఉన్నతాధికారులు పాలుపంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ సందర్భంగా విడుదల అవుతున్న ప్రచురణలను ”గ్రంథాలు” (పాఠ్యగ్రంథాలు)గా అభివర్ణించారు. ఇవి చరిత్రలో ముద్రను వేయగలవని ఆయన అన్నారు.

ఈ రోజు ప్రారంభానికి నోచుకున్న వస్తు ప్రదర్శనశాల గతాన్ని తిరిగి వ్యవహారంలోకి తీసుకువచ్చేందుకు చేపట్టిన ఒక గొప్పదైన పని అని కూడా ఆయన చెప్పారు.

రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి అందించిన సేవలు అపారమైనవి, అలాగే ఆయన రాష్ట్రపతి పదవికి సైతం జోడించింది ఎంతో ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. విభిన్నమైన రాజకీయ పూర్వ రంగాలకు చెందిన వారు కలసి ఎలా పనిచేయగలరో రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ ని చూసి మనం నేర్చుకోవచ్చు అని ప్రధాన మంత్రి అన్నారు.

జల సంరక్షణ గాని, నవీకరణ యోగ్యమైన శక్తి గాని, లేదా లేదా డిజిటల్ ఇండియా గాని.. ఈ కార్యక్రమాలన్నింటినీ రాష్ట్రపతి భవన్ లో అమలుచేయడం గమనార్హమని ప్రధాన మంత్రి అన్నారు.