పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గ గ్రామ ప్రధాన్ లను న్యూ ఢిల్లీ లోని తన నివాసంలో ఈ రోజు సత్కరించారు.
వారితో ఆయన సంభాషిస్తూ, ప్రధాన్ లు తమ తమ గ్రామాలలో అందరికీ టీకాలను వేయించడం, చదువుకునే పిల్లలు ఎవ్వరూ కూడా మధ్యలో బడి మానివేయకుండా చూడడం, ఇంకా.. స్వచ్ఛత ను పరిరక్షించడం కోసం పాటుపడాలి అంటూ వారిని ఉత్సాహపరిచారు.
అలాగే కుమారులకు, కుమార్తెలకు మధ్య ఎటువంటి వివక్షనైనా తొలగించాలి అంటూ గ్రామ ప్రధాన్ ల బృందానికి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆడ పిల్ల పుట్టిన సమయంలో ఒక మొక్కను నాటడం ద్వారా ఆ సందర్భాన్ని ఒక వేడుకగా జరుపుకొనేందుకు తాము సిద్ధం అంటూ గ్రామ ప్రధాన్ ల బృందం తమ సుముఖతను వ్యక్తం చేసింది.
ప్రధాన్ లు పార్లమెంట్ ను, రాజధాని నగరాన్ని సందర్శించినప్పటి వారి అనుభూతులను వారణాసి నివాసులతో పంచుకోవాలని ప్రధాన మంత్రి కోరారు.