Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యు కె అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రి ప్రీతి పటేల్ భేటీ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యు కె అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రి ప్రీతి పటేల్ భేటీ


యునైటెడ్ కింగ్ డమ్ అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రి ప్రీతి పటేల్ ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు.

ఆమె అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రి పదవిలో నియమితురాలయినందుకు ప్రధాన మంత్రి ఆమెను అభినందించారు. ప్రీతి పటేల్ ఇదివరకు తాను నిర్వహించిన పదవుల కారణంగా భారతదేశాన్ని పలుమార్లు సందర్శించారని, భారతదేశంతో సుదీర్ఘ కాలం పాటు అనుబంధాన్ని ఆమె కలిగివున్నారన్న సంగతిని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కిందటి సంవత్సరం నవంబరులో తాను యు కె ను సందర్శించానని, ఆ పర్యటన విజయవంతంగా ముగిసిందని కూడా ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. తన పర్యటన అనంతరం చేపట్టిన చర్యలను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.

తమ మంత్రిత్వ శాఖ కార్యకలాపాలు, భారతదేశంలో తమ మంత్రిత్వ శాఖ భావి ప్రణాళికలను గురించి పటేల్ ప్రధాన మంత్రి కి వివరించారు. నైపుణ్యాల వికాసం, మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహాయం, నవ కల్పన, శక్తి, వ్యాపారాన్ని సులభంగా నిర్వహించుకోవడం తదితర రంగాలలో ద్వైపాక్షిక సహకారం గురించి కూడా పటేల్ చర్చించారు.