Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిఐఎమ్ ఎస్ టిఇసి నేషనల్ సెక్యూరిటీ చీఫ్స్ భేటీ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిఐఎమ్ ఎస్ టిఇసి నేషనల్ సెక్యూరిటీ చీఫ్స్ భేటీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ది బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టి- సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిఐఎమ్ ఎస్ టిఇసి) సభ్యత్వ దేశాలకు చెందిన జాతీయ భద్రత సంబంధ ప్రధానాధికారులు నేడు భేటీ అయ్యారు.

ప్రధాన మంత్రి దార్శనికతను బిఐఎమ్ ఎస్ టిఇసి సభ్యత్వ దేశాల నేషనల్ సెక్యూరిటీ చీఫ్స్ ప్రశంసించారు. సభ్యత్వ దేశాల నేషనల్ సెక్యూరిటీ చీఫ్స్ మొట్టమొదటి సమావేశానికి భారతదేశంలో ఆతిథ్యం ఇచ్చినందుకుగాను ఆయనకు వారు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సమావేశంలో నేషనల్ సెక్యూరిటీ చీఫ్స్ వారి ఆలోచనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి వివరించారు.

ఉగ్రవాదం, తీవ్రవాదం, సమూల సంస్కరణవాదం, మత్తుమందులు, ఆయుధాలు, మనుషుల అక్రమ చేరవేత మరియు ప్రకృతి విపత్తులు వంటి ఉమ్మడి భద్రతా సంబంధ ముప్పులను ఎదుర్కోవడం కోసం సమష్టిగా ముందుకు రావలసిందంటూ బిఐఎమ్ ఎస్ టిఇసి సభ్యత్వ దేశాలకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ పిలుపునిచ్చారు.

సైబర్ సెక్యూరిటీ యొక్క డమేన్, మారిటైమ్ సంబంధిత డమేన్ ల వంటి సాంప్రదాయేతర భద్రతాపరమైన ముప్పుల విషయంలోనూ బిఐఎమ్ ఎస్ టిఇసి సభ్యత్వ దేశాలు కలసి కృషి చేయాలని కూడా ప్రధాన మంత్రి అన్నారు.