Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జపాన్ రక్షణ శాఖ మంత్రి జనరల్ శ్రీ నకాతానీ భేటీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని జపాన్ రక్షణ శాఖ మంత్రి జనరల్ శ్రీ నకాతానీ ఈ రోజు కలుసుకున్నారు.

ఈ నెల మొదట్లో ఢాకా లో జరిగిన ఉగ్రవాద దాడిలో జపాన్ కు చెందిన పౌరులు చనిపోవడం పట్ల ప్రధాన మంత్రి సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడడంలో ద్వైపాక్షిక, బహుళపాక్షిక సహకారం మరింతగా పెంపొందాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.

రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకార కార్యక్రమాల గురించి ప్రధాన మంత్రికి శ్రీ నకాతానీ క్లుప్తంగా వివరించారు. 2016 ఫిబ్రవరి లో విశాఖపట్టణంలో జరిగిన ఇంటర్ నేషనల్ ఫ్లీట్ రివ్యూలోను, అలాగే 2016 జూన్ లో జపాన్ కోస్తా తీరానికి ఆవల జరిగిన మలబార్ విన్యాసంలోను జపాన్ పాలుపంచుకున్నందుకు ప్రధాన మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

తూర్పు ఆసియా, ఇంకా ఆగ్నేయ ఆసియాలో ప్రాంతీయ పరిణామాలను కూడా ప్రధాన మంత్రి కి శ్రీ నకాతానీ క్లుప్తంగా వివరించారు.

ఈ సంవత్సరం జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి తాను జపాన్ ను సందర్శించనున్నానని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఎప్పుడెప్పుడు ఈ పర్యటనకు బయలుదేరుతానా అని తాను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానన్నారు.