పిఎంఇండియా
ప్రతి ఒక్కరికీ నమస్కారం,
మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 70వ సంవత్సరాన్ని మనం ఈ ఏడాది ఆగస్టు 15న స్మరించుకోబోతున్నందువల్ల ఆ రోజు ఒక ప్రధానమైన మైలురాయి కానున్నది. ఈ ఘడియకు కొద్ది రోజుల ముందుగా పార్లమెంట్ ప్రస్తుత సమావేశాలు ఆరంభం అవుతున్నందువల్ల ఈ సమావేశాలు కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నాయి. దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించిన గొప్ప స్వాతంత్ర్య సమర యోధులను వచ్చే పంద్రాగస్టు నాడు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం.
ఈ సారి పార్లమెంట్ సమావేశాల సంరద్భంలో మన 70 ఏళ్ల ప్రస్థానం కొత్త శిఖరాలను అందుకోనున్నది. ఇందుకోసం.. మనం అధిక నాణ్యత కలిగిన చర్చలు జరుపుతూ, ప్రధానమైన నిర్ణయాలను తీసుకోవలసి ఉన్నది. అలా చేసినప్పుడు ఈ దేశం శరవేగంగా ముందుకు సాగగలుగుతుంది. కాబట్టి, మనమందరం దేశానికి ఒక నూతన ఉత్తేజాన్ని అందించి, కొత్త దిశను చూపించేందుకు పార్లమెంట్ లో చేతులు కలపాల్సిన ఆవశ్యకత ఉన్నది.
దేశ హితం కోసం, దేశాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్లడం కోసం అత్యుత్తమమైన నిర్ణయాలను తీసుకోవడానికి కట్టుబడి ఉన్నామన్న భావనను గత కొన్ని రోజులుగా అన్ని పార్టీలు, అందరు నేతలు.. వ్యక్తిగతంగా గాని, లేదా సమష్టిగా గాని.. పంచుకొన్నారని నేను నమ్ముతున్నాను.
మీకందరికీ ఇవే నా శుభాకాంక్షలు.
ధన్యవాదములు.
The mood all around is to take good decisions and move towards the path of progress: PM at the start of Parliament session
— PMO India (@PMOIndia) July 18, 2016
Happening now: PM @narendramodi is introducing the new Ministers who took oath recently, in the Lok Sabha.
— PMO India (@PMOIndia) July 18, 2016