Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి సూరజ్ కుండ్ లో ఏర్పాటైన రైల్ వికాస్ శిబిరాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు

ప్రధాన మంత్రి సూరజ్ కుండ్ లో ఏర్పాటైన రైల్ వికాస్ శిబిరాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సూరజ్ కుండ్ లో ఏర్పాటైన రైల్ వికాస్ శిబిరాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు.

ఇది సాంకేతిక విజ్ఞానం చోదకశక్తిగా దూసుకుపోతున్న శతాబ్దమని, నవకల్పన అత్యవసరమని ఆయన అన్నారు. అందువల్ల రైల్వేలు ‘గతి’ (వేగం) తో పాటు ‘ప్రగతి’ (పురోగతి) ని కూడా అనుసరించాలని ఆయన చెప్పారు.

ప్రతి ఒక్క అధికారి అతడికి అప్పగించిన పనిని చేయడం మంచిదేనని, అయితే మనం అంతా కలిసి పనిచేయాల్సివుందని, అలాగే రైల్వేలు ఏ విధంగా రూపుదాల్చాలని మనం కోరుకొంటున్నామో ఆ విషయమై ఆలోచించాల్సివుందని కూడా ఆయన అన్నారు.

భారతీయ రైల్వేలు పురోగమించాలని, దాంతో పాటు ఆర్థికంగా బలపడాలని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. ఇది భారతదేశాన్ని, మరీ ముఖ్యంగా రైల్వేల కోసం పనిచేస్తున్న వారికి లబ్ధిని చేకూర్చుతుందని ఆయన చెప్పారు.

తన ప్రభుత్వ రైల్వే బడ్జెట్టుల శ్రద్ధ ఎన్నడూ రాజకీయాలపైన కేంద్రీకృత‌ం కాలేదు అని ఆయన చెబుతూ, ప్రభుత్వం రైల్వేల విషయంలో రూపావళీసంబంధి పరివర్తన దిశగా కృషి చేసినట్లు వివరించారు. ఈ శతాబ్దం మార్పునకు లోనైంది, కాబట్టి మన రైల్వేల వ్యవస్థ కూడా మారాల్సివుందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. మనకు ఉన్న జట్టుతో దీనిని మనం సాధించగలమన్న విశ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు.

తన బాల్యం రైలు స్టేషన్ లోని ప్లాట్ ఫారాల మీద గడచిపోయిందని ప్రధాన మంత్రి చెబుతూ, రైల్వేలతో తన బంధం దృఢమైందని, రైల్వేలలో మార్పు తేవాలని తాను కోరుకోవడానికి ఇది కూడా మరొక కారణమని తెలిపారు.

***