Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ ఆరోగ్య‌దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి శుభాకాంక్ష‌లు


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఒక సందేశ‌మిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, మాన‌వ ప్ర‌గ‌తికి మంచి ఆరోగ్య‌మే పునాది, ఈ ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వం సంద‌ర్భంగా మీరంద‌రూ మంచి ఆరోగ్యంతో ఉండాల‌ని, అభివృద్ధిలో ఉన్న‌త శిఖ‌రాల‌ను అందుకోవ‌డం కొన‌సాగాల‌ని ఆకాంక్షించారు.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌, ఇత‌రులు ఎంపిక చేసిన థీమ్ అయిన‌, ప్ర‌తి ఒక్క‌రికీ సార్వ‌త్రిక ఆరోగ్య సదుపాయం: ప‌్ర‌తి ఒక్క‌రికి, ప్ర‌తి చోటా నినాదాన్ని నేను స్వాగ‌తిస్తున్నాను. అంద‌రికీ ఆరోగ్య సాధ‌న‌కు జ‌రుగుతున్న అన్వేష‌ణ ఇది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌క‌మైన ఆయుష్మాన్ భార‌త్‌ను తీసుకువ‌చ్చేందుకు ఇది మ‌న‌కు ప్రేర‌ణ‌నిచ్చింది, అని ప్ర‌ధానమంత్రి పేర్కొన్నారు.