Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ చమురు- గ్యాస్ రంగ నిపుణులతో ప్రధాని చర్చ


ప్రపంచ చమురు- గ్యాస్ రంగ నిపుణులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చర్చించారు. రెండు గంటలకు పైగా జరిగిన ఈ చర్చలలో కేంద్ర మంత్రులు శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, ఇంకా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ శ్రీ అరవింద్ పణగరియా, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు నీతి ఆయోగ్ కు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ చర్చలలో భారత శక్తి మిశ్రమం (ఎనర్జీ మిక్స్)లో గ్యాస్ వాటా పెరుగుతూ ఉండటం, భారతదేశంలో చమురు- గ్యాస్ రంగంలో నూతన పెట్టుబడులు, నియంత్రణ విధి విధానాలు, విదేశాల చమురు- గ్యాస్ రంగ ఆస్తుల కొనుగోళ్లు, షేల్ గ్యాస్, కోల్- బెడ్ మీథేన్ వంటి ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న రంగాలు, “మేక్ ఇన్ ఇండియా”లో చమురు గ్యాస్ రంగానికి సంబంధించిన అవకాశాలపై దృష్టి కేంద్రీకరించారు.

ఈ రంగంలోకి పెట్టుబడులను తీసుకురావడం కోసం, సాంకేతికంగా ఈ రంగ స్థాయిని పెంచడం కోసం, ఈ రంగంలో మానవ వనరుల వికాసం కోసం ఈ రంగాన్ని సరికొత్తగా పరిశీలించే విషయంలో తనకున్న ఆలోచనలను ప్రధాని ఈ సందర్భంగా వివరించారు.