Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా గల గుజరాతీలకు నూతన సంవత్సర ఆరంభ వేళ శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఉన్న గుజ‌రాతీల‌కు కొత్త సంవ‌త్స‌రం మొద‌ల‌వుతున్న సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. గుజ‌రాతీలు దీపావ‌ళి మ‌రుస‌టి రోజు ను కొత్త సంవ‌త్స‌రం ప్రారంభ దినంగా జ‌రుపుకొంటారు.

‘‘ప్ర‌పంచ‌ం అంత‌టా ఉన్న గుజ‌రాతీల‌ందరికీ సాల్ ముబార‌క్. రానున్న సంవ‌త్స‌రం సంతోషాన్ని, స‌మృద్ధిని ప్ర‌సాదించుగాక మరియు మీ ఆకాంక్ష‌లు నెర‌వేరే విధంగా మార్గాన్ని సుగ‌మం చేయుగాక’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

******