Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ సంస్కృతి సంగ‌మం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

ప్రపంచ సంస్కృతి సంగ‌మం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

ప్రపంచ సంస్కృతి సంగ‌మం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం


న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ సంస్కృతి సంగ‌మం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భార‌త‌ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మానవాళికి సేవచేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 35వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ప్రపంచ సంస్కృతి సంగ‌మం కోసం ఢిల్లీకి విచ్చేసిన దేశ, విదేశీ ప్రతినిధులందరికి స్వాగతం ప‌లుకుతూ. 150కి పైగా దేశాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ద్వారా అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్న శ్రీశ్రీ రవిశంకర్ ను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. తన మంగోలియా పర్యటనలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఈ సంద‌ర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. ప్రపంచానికి భారతదేశం చేయాల్సింది చాలా ఉందని.. ఇలా చేసేందుకు ముందుగా భారత సంస్కృతిని, దీని గొప్పతనాన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ప్రపంచమంతా భారత్‌ను ప్రశంసిస్తోందన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడుతూ.. అనుకున్న లక్ష్యాలను చేరుకోవటం, కష్టాలను దాటి ముందుకెళ్లేందుకు కావాల్సిన పట్టుదలకోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ చాలా అవసరమని ప్రధాన మంత్రి తెలిపారు.

ప్రధాని ప్రసంగానికి ముందు ప్రపంచ నలుమూలలనుంచి వచ్చిన విదేశీ ప్రతినిధులు మాట్లాడారు. పెద్దసంఖ్యలో కళాకారులు తమ కళళ‌ను ప్రదర్శించారు.