పిఎంఇండియా
ఆప్యాయపూర్వక శుభాకాంక్షలతో పాటు మంచి మాటలతో అభినందించిన ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ ప్రధానమంత్రి కమలా పర్సాద్-బిస్సేసర్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వాధినేతగా దేశ సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానికి ఆమె ఈ అభినందనలు తెలిపారు.
భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య స్నేహసంబంధాలు నిరంతరం కొత్త శిఖరాలను తాకుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో రెండు దేశాలు తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటాయన్న పూర్తి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
“ప్రధాన మంత్రి కమలా పర్సాద్-బిస్సేసర్.. మీ ఆప్యాయపూర్వక శుభాకాంక్షలు, మంచి మాటలకు ధన్యవాదాలు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య స్నేహం నిరంతరం కొత్త శిఖరాలను తాకుతోంది. రాబోయే సంవత్సరాల్లో మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం“.
Thank you, Prime Minister Kamla Persad-Bissessar, for your warm wishes and kind words. The friendship between India and Trinidad and Tobago continues to scale new heights. We look forward to strengthening our partnership in the years to come. @PM_Kamla
— Narendra Modi (@narendramodi) October 8, 2026