పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనకు శుభాకాంక్షలు తెలిపిన నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్, నైజీరియా సన్నిహిత భాగస్వాములని, గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహిస్తున్న ప్రధాన స్వరాలని ఆయన పునరుద్ఘాటించారు.
భారత్ – నైజీరియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, మరింత సమ్మిళిత, సుసంపన్న, శాంతియుత ప్రపంచం కోసం ఇరు దేశాలు పంచుకుంటున్న దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు శ్రీ మోదీ తెలిపారు.
“అభివృద్ధి చెందుతున్న దేశాల (గ్లోబల్ సౌత్) గొంతును బలంగా వినిపిస్తున్న భారత్ నైజీరియాలు అత్యంత సన్నిహిత భాగస్వామ్య దేశాలు. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సమ్మిళిత, సంపన్న, శాంతియుత ప్రపంచం దిశగా మన ఉమ్మడి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ద్వైపాక్షిక సహకారాన్ని కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను” అని శ్రీ మోదీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు
***.
Thank you, President Tinubu. India and Nigeria are close partners and leading voices of the Global South. I look forward to continuing our cooperation to further strengthen our Strategic Partnership and advance our shared vision for a more inclusive, prosperous and peaceful world. @NGRPresident
— Narendra Modi (@narendramodi) October 7, 2026