పిఎంఇండియా
భారతదేశానికి చెందిన భారతీయ ప్రమాణాల మండలి (బిఐఎస్), మాలి గణతంత్రానికి చెందిన డైరెక్షన్ నేషనల్ ది ఇండస్ట్రీస్ (ఎమ్ఎల్ఐఎన్ డిఐ) కి మధ్య ప్రమాణీకరణం మరియు అనుసరణ నిర్ధారణ అంశాల పై ఒక అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు)కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
భారతదేశం, మాలి లు మరింత సన్నిహితంగా సహకరించుకొనేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని కల్పించడం ఈ ఎమ్ఒయు ధ్యేయం. ఇటువంటి యంత్రాంగం ఏర్పడితే, ప్రమాణీకరణం మరియు అనుసరణ నిర్ధారణ కార్యకలాపాలను పటిష్ట పరచాలన్న ఉమ్మడి సంకల్పం నెరవేరగలదు. తద్వారా ఇరు దేశాల వ్యాపారాన్ని, తత్సంబంధిత నైపుణ్యాన్ని పంచుకొనేందుకు వీలు ఉంటుంది.