Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖ హాకీ క్రీడాకారుడు శ్రీ మొహమ్మద్ శాహిద్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాకీలో దిగ్గజ ఆటగాడైన శ్రీ మొహమ్మద్ శాహిద్ అకాల మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.

“శ్రీ మొహమ్మద్ శాహిద్ దురదృష్టకరంగా అకాల మరణం పొందడంతో, ప్రతిభావంతుడైన ఒక క్రీడాకారుడిని భారతదేశం పోగొట్టుకొన్నది. ఆయన ఎంతో ఉద్వేగంతోను, ఉత్సాహంతోను ఆడే వారు.

ఆయన ప్రాణాలను కాపాడడానికి మేం మా శాయశక్తులా ప్రయత్నించాం; కానీ.. దు:ఖదాయకమైన విషయం ఏమిటంటే.. మా సహాయం గాని, ప్రార్థనలు గాని ఆయనను కాపాడడానికి సరిపోలేదు. ఆయనకు ఇవే నా నివాళులు. శ్రీ శాహిద్ ఆత్మకు శాంతి లభించుగాక” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.