పిఎంఇండియా
ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతంలో సంభవించిన తీవ్ర భూకంపంలో ప్రతి ఒక్కరూ భద్రంగా, సురక్షితంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రార్థించారు. భూకంపం కారణంగా జరిగిన నష్టాన్ని త్వరగా అంచనా వేయాలని ఆయన కోరారు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లతో సహా ఎక్కడైనా అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని ప్రకటించారు. “ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చినట్టు తెలిసింది. ఈ ప్రకంపనలు భారత్‌లో కూడా కనిపించాయి. అంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థిస్తున్నాను. త్వరగా నష్టాన్ని అంచనా వేయాలని కోరాను. భారత్ అన్నివిధాలుగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది”, అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
I have asked for an urgent assessment and we stand ready for assistance where required, including Afghanistan & Pakistan.
— Narendra Modi (@narendramodi) October 26, 2015
Returned from Bihar. Spoke to J&K CM Shri Mufti Mohammad Sayeed & took stock of the situation arising due to the unfortunate earthquake.
— Narendra Modi (@narendramodi) October 26, 2015