పిఎంఇండియా
ప్రత్యేక ఆర్ధిక మండలులు ( సవరణ) బిల్లు 2019ని ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రత్యేక ఆర్ధిక మండలులు (సవరణ) ఆర్డినెన్స్, 2019 ( 12 ఆఫ్ 2019) స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది.
ప్రత్యేక ఆర్ధిక మండలులు చట్టం, 2005, సెక్షన్ 2, సబ్ సెక్షన్ ( 5)కు సవరణ చేశారు. ఈ సవరణ కారణంగా… కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏదైనా సంస్థ… ఆర్ధిక మండలిలో ఏదైనా యూనిట్ నెలకొల్పడానికి అనుమతి ఇచ్చే అర్హతను కలిగి వుంటుంది.