పిఎంఇండియా
నేపాల్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి శ్రీ కమల్ థాపా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. నేపాల్ ఉప ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కమల్ థాపాకు ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్ నూతన ప్రభుత్వానికి కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కమల్ థాపా నేపాల్ తాజా పరిణామాలను ప్రధానికి వివరించారు. నేపాల్ తో సంప్రదాయ స్నేహ బంధాన్ని పటిష్టం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. ఐక్య, ప్రగతిశీల, సుస్థిర, అభివృద్ధిచెందిన నేపాల్ ను చూడడమే భారత్ ప్రభుత్వ అభిలాష అని ప్రధాని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
Met Mr.Kamal Thapa& reiterated India's desire to see a united, inclusive, stable & prosperous Nepal. http://t.co/dxOpChiiYD
— NarendraModi(@narendramodi) October 19, 2015