పిఎంఇండియా
2014 బ్యాచ్‌కు చెందిన శిక్షణలో ఉన్న 100 మందికి పైగా ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారులు ఈరోజు 7 రేస్స్ కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ శిక్షణాధికారులతో ప్రధాని సంభాషిస్తూ – ఖాకీ దుస్తులు శక్తి చిహ్నమని, వారు ఈ శక్తిని సామాన్యుల సాధికారతకు వినియోగించాలని హితవు పలికారు. దేశ మాతకు సేవ చేసే అరుదైన అవకాశం ఐపీఎస్ లకు లభించిందని, వారు తమ అంకిత భావాన్ని చాటుకోవడంలో ఎంత మాత్రం రాజీపడకూడదన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవాల్ కూడా పాల్గొన్నారు.
Told young IPS officer trainees of 2014 batch- the uniform gives you the power to empower lives of common citizens. https://t.co/Jihv6oRIkj
— Narendra Modi (@narendramodi) November 18, 2015