Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీతో 2014 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ శిక్ష‌ణ అధికారుల స‌మావేశం

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీతో 2014 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ శిక్ష‌ణ అధికారుల స‌మావేశం

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీతో 2014 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ శిక్ష‌ణ అధికారుల స‌మావేశం

2014 బ్యాచ్‌కు చెందిన శిక్ష‌ణ‌లో ఉన్న 100 మందికి పైగా ఇండియ‌న్ పోలీస్ స‌ర్వీస్ (ఐపీఎస్‌) అధికారులు ఈరోజు 7 రేస్స్ కోర్స్ రోడ్డులోని ప్ర‌ధాని నివాసంలో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆ శిక్ష‌ణాధికారుల‌తో ప్ర‌ధాని సంభాషిస్తూ – ఖాకీ దుస్తులు శ‌క్తి చిహ్న‌మ‌ని, వారు ఈ శ‌క్తిని సామాన్యుల సాధికార‌త‌కు వినియోగించాల‌ని హిత‌వు ప‌లికారు. దేశ మాత‌కు సేవ చేసే అరుదైన అవ‌కాశం ఐపీఎస్ ల‌కు ల‌భించింద‌ని, వారు త‌మ అంకిత భావాన్ని చాటుకోవ‌డంలో ఎంత మాత్రం రాజీప‌డ‌కూడ‌ద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు శ్రీ అజిత్ దోవాల్ కూడా పాల్గొన్నారు.