Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీతో మాట్లాడిన ఫ్రాన్స్ అధ్య‌క్షుడు శ్రీ హొలాండ్


పారిస్ లో జ‌రుగుతున్న‌ కాప్-21 వాతావ‌ర‌ణ చ‌ర్చ‌ల తాజా ప‌రిస్థితిపై వివ‌ర‌ణ‌.

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీతో ఫ్రాన్స్ అధ్య‌క్షుడు శ్రీ హొలాండ్ ఈ రోజు మాట్లాడారు. కాప్‌-21 వాతావ‌ర‌ణ చ‌ర్చ‌ల తాజా స్థితిని ప్ర‌ధానికి వివ‌రించారు. ఈ చ‌ర్చ‌లు పారిస్ లో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇవి ఇప్పుడు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. వివ‌రాలను తెలియ‌జేయ‌డంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు చూపిన చొర‌వ‌ను ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.