Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి మరియు ఇజ్రాయిల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు మ‌ధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాష‌ణ‌


 
ఇజ్రాయిల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా సంభాషించారు. 

ప్రధాని శ్రీ నెతన్యాహూ ఇటీవల పదవీ బాధ్యతల ను స్వీకరించడం పట్ల శ్రీ మోదీ తన అభినందనల ను తెలిపారు.  ప్రధాని శ్రీ నెతన్యాహూ నాయకత్వం లో మరియు మార్గదర్శకత్వం లో భారతదేశం-ఇజ్రాయిల్ భాగస్వామ్యం ప్రవర్ధమానం కాగలదన్న విశ్వాసాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు.

కోవిడ్-19 ప్రపంచవ్యాప్త వ్యాధి నేపథ్యం లో, టీకామందులు, చికిత్సాధ్యయనం ఇంకా  రోగనిర్ధారణ రంగాల లో పరిశోధన మరియు అభివృద్ధి ప్రయత్నాలు సహా  భారతదేశం, ఇజ్రాయిల్ లు వాటి యొక్క సహకారాన్ని విస్తరింపచేసుకొనేందుకు సంభావ్యత గల రంగాల ను గురించి నేత లు చర్చించారు.  ఉభయ దేశాల కు చెందిన నిపుణుల జట్ల మధ్య ప్రస్తుతం అమలవుతున్న ఆదాన ప్రదానాల ను కొనసాగించాలని వారు అంగీకరించారు; అలాగే, ఆ తరహా సహకారం తాలూకు ఫలాల ను మానవాళి విస్తృత లబ్ధి కై అందుబాటు లోకి తీసుకురావాలని కూడా వారు తమ ఏకీభావాన్ని వ్యక్తం చేశారు. 

ద్వైపాక్షిక కార్యక్రమాల చర్చనీయాంశాల జాబితా లో ఇతర ముఖ్యమైన అంశాల ను సైతం నేత లు సమీక్షించారు.  కోవిడ్ అనంతరం రూపుదాల్చే ప్రపంచం అనేక రంగాల లో ఇరు పక్షాల కు ప్రయోజనాలు చేకూరగల మరిన్ని అవకాశాల ను అందించగలదంటూ వారు తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు.  మరీ ముఖ్యం గా, ఆరోగ్య సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ సంబంధిత నూతన ఆవిష్కరణ, రక్షణ రంగ సంబంధిత సహకారం మరియు సమాచార సాంకేతిక విజ్ఞానం వంటి రంగాల లో ఇప్పటికే బలిష్టం గా ఉన్న భారతదేశం, ఇజ్రాయిల్ ల సహకారాన్ని ఇతోధికం గా విస్తరించుకొనేందుకు గొప్ప అవకాశాలు ఉంటాయని వారు అంచనా వేశారు. 

మారుతున్న ప్రపంచ స్థితిగతుల లో ఎదురయ్యే సవాళ్ల ను మరియు దక్కే అవకాశాల ను గురించిన అంచనాల ను పరస్పరం వెల్లడి చేసుకోవడం కోసం ఒకరి తో మరొకరు సంప్రదింపులు జరుపుకొంటూ ఉండేందుకు నేతలు ఇరువురూ అంగీకరించారు. 
 

**