Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రికి రాఖీ క‌ట్టిన 103 ఏళ్ళ వితంతువు శ్రీ‌మ‌తి శ‌ర్బ‌తీ దేవి


‘ర‌క్షా బంధ‌న్’ పర్వదినాన్ని పురస్కరించుకొని 103 ఏళ్ళ వితంతువు శ్రీ‌మ‌తి శర్బ‌తీ దేవి ఈ రోజు ప్ర‌ధాన మంత్రి నివాసాన్ని సంద‌ర్శించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మణికట్టుకు రాఖీని క‌ట్టారు.

శ్రీమ‌తి శ‌ర్బ‌తీ దేవి తన సోద‌రుడిని దాదాపు 50 సంవ‌త్స‌రాల కింద‌ట కోల్పోయారు. ఈ కారణంగా ఆమె ఎల్లప్పుడూ- మరీ ముఖ్యంగా రాఖీ పండుగ రోజున- తన సోద‌రుడు లేని లోటును తలచుకొని దు:ఖిస్తూ ఉండే వారు. ఈ సంగతిని ఆమె కుమారుడు ఒక ఉత్త‌రం ద్వారా ప్ర‌ధాన మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు. ఇది జ‌రిగాక ప్ర‌ధాన మంత్రి శ్రీ‌మ‌తి శ‌ర్బ‌తీ దేవిని, ఆమె కుటుంబ స‌భ్యులను ఈ రోజు త‌న నివాసానికి విచ్చేయ‌వ‌ల‌సిందంటూ ఆహ్వానం పంపారు. శ్రీ‌మ‌తి శ‌ర్బ‌తీ దేవి ప్ర‌ధాన మంత్రితో భేటీ అయ్యి, ఆయ‌న మణికట్టుకు రాఖీని క‌ట్టి అత్యంత ప్రసన్నురాలు అయ్యారు. ప్ర‌ధాన మంత్రి తో ఈ రోజు ఆమె ఆత్మీయ సమావేశం చాలా బాగా సాగింది.