Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రిని క‌లుసుకున్న హాంకాంగ్ ప్ర‌త్యేక ప‌రిపాల‌న ప్రాంతం (ఎస్ఎఆర్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ సివై లూంగ్

ప్ర‌ధాన మంత్రిని క‌లుసుకున్న హాంకాంగ్ ప్ర‌త్యేక ప‌రిపాల‌న ప్రాంతం (ఎస్ఎఆర్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ సివై లూంగ్


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో హాంకాంగ్ ప్ర‌త్యేక ప‌రిపాల‌న ప్రాంతం (ఎస్ఎఆర్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ సివై లూంగ్ ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు.

శ్రీ సివై లూంగ్ భార‌త‌దేశంలో ఆధికారిక ప‌ర్య‌ట‌న‌కు రావ‌డం ఇదే మొద‌టి సారి. ప్ర‌ధాన మంత్రి ఆయ‌న‌కు రంగా స్వాగ‌తం ప‌లికారు. భార‌త‌దేశం, హాంకాంగ్ ల మ‌ధ్య వ్యాపారం, పెట్టుబడులు, ప‌ర్య‌ట‌క రంగాల‌లో ఇతోధిక స‌హ‌కారానికి శ్రీ లూంగ్ ప‌ర్య‌ట‌న దోహ‌ద‌ప‌డ‌గ‌ల‌ద‌న్న ఆశాభావాన్ని ప్ర‌ధాన మంత్రి వ్య‌క్తం చేశారు.

హాంకాంగ్ కేంద్రంగా ప‌నిచేస్తున్న కంపెనీలు భార‌త‌దేశంలో కార్య‌క‌లాపాలు జ‌ర‌పాల‌ని గ‌ట్టిగా కోరుకుంటున్నాయ‌ని ప్ర‌ధాన‌ మంత్రికి శ్రీ లూంగ్ వివ‌రించారు.

ద్వైపాక్షిక ఆర్థిక స‌హ‌కారాన్ని బ‌ల‌ప‌ర‌చుకోవాల‌ని, మ‌రీ ముఖ్యంగా విత్త సేవ‌ల రంగంలోనూ, దాంతో పాటే విద్యా రంగంలోనూ రెండు దేశాలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి, శ్రీ సివై లూంగ్ లు ఇరువురూ అభిప్రాయ‌ప‌డ్డారు.