Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి కి టెలిఫోన్ ద్వారా అభినంద‌న‌ లు తెలిపిన భూటాన్ రాజు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో భూటాన్ రాజు, శ్రేష్ఠుడు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్ 2019వ సంవ‌త్స‌రం మే నెల 23వ తేదీన టెలిఫోన్ లో మాట్లాడి, భార‌త‌దేశం లో జ‌రిగిన 17వ లోక్ స‌భ ఎన్నిక‌ల లో శ్రీ మోదీ సాధించిన విజ‌యాని కి గాను ఆయ‌న కు అభినంద‌న‌లు తెలియజేశారు.

భార‌త‌దేశ ప్ర‌జ‌లు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ నాయ‌క‌త్వం లో పురోగ‌తి మ‌రియు స‌మృద్ధి బాట లో సాగాలని రాజు ఈ సందర్భం గా పేర్కొంటూ మోదీ కి త‌న శుభాకాంక్ష‌ల ను వ్యక్తం చేశారు.

భూటాన్ రాజు త‌నకు శుభాకాంక్ష‌లు తెలిపినందుకు ప్రతి గా ఆయ‌న కు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. భూటాన్ తో విశిష్ట‌మైన మ‌రియు ప్ర‌త్యేక‌మైన మైత్రి కి భార‌త ప్ర‌భుత్వం అత్యంత ప్రాముఖ్యాన్ని క‌ట్ట‌బెడుతోంద‌ని శ్రీ మోదీ స్ప‌ష్టం చేశారు. ఈ భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ఉన్న‌త శిఖ‌రాల కు తీసుకుపోయేందుకు రాయ‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ భూటాన్ తో స‌న్నిహితం గా ప‌ని చేయ‌డాన్ని కొన‌సాగించడానికి భార‌త ప్ర‌భుత్వం కట్టుబడివున్నట్లు శ్రీ మోదీ పున‌రుద్ఘాటించారు.