Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి కి ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలిపిన భూటాన్ ప్ర‌ధాని డాక్ట‌ర్ లోటే శెరింగ్


భార‌త‌దేశం లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సాధించిన విజ‌యాని కి గాను ఆయ‌న ను అభినందించ‌డం కోసం భూటాన్ ప్ర‌ధాని, శ్రేష్ఠుడు లియాన్‌చెన్‌ డాక్ట‌ర్ లోటే శెరింగ్ 2019వ సంవ‌త్స‌రం మే నెల 23వ తేదీ న టెలిఫోన్ ద్వారా ఆయన తో మాట్లాడారు.

భార‌త‌దేశం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ అందించిన‌టువంటి బ‌ల‌మైన నాయ‌క‌త్వాన్ని ప్ర‌ధాని డాక్ట‌ర్ లోటే శెరింగ్ ఈ సందర్భం గా ప్ర‌శంసించారు. శ్రీ మోదీ నాయ‌క‌త్వం లో, దార్శ‌నిక‌త లో భార‌త‌దేశం గొప్ప సాఫ‌ల్యాల ను సాధించగలుగుతుంద‌న్న ఆశాభావాన్ని కూడా భూటాన్ ప్ర‌ధాని వ్య‌క్తం చేశారు.

డాక్ట‌ర్ లోటే శెరింగ్ తనకు అభినంద‌న‌ లు తెలిపినందుకు ఆయన కు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ధ‌న్య‌వాదాలు ప‌లికారు. ఉభ‌య దేశాల మ‌ధ్య గ‌ల ప్ర‌త్యేక‌మైన, మార్గ‌ద‌ర్శ‌క‌మైన ద్వైపాక్షిక సంబంధాల ను మ‌రింత గా బ‌లోపేతం చేసుకోవ‌డం కోసం రాయ‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ భూటాన్ తోను, భూటాన్ ప్ర‌ధాని డాక్ట‌ర్ లోటే శెరింగ్ తో క‌ల‌సి ప‌ని చేయాల‌న్న త‌న వ‌చ‌నబ‌ద్ధత ను శ్రీ మోదీ పున‌రుద్ఘాటించారు.