పిఎంఇండియా
ఆరకల్ గ్లోబల్ సిఇఒ సఫ్రా కాట్జ్ శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
బెంగళూరు కేంద్రంగా అత్యాధునిక కేంపస్ కోసం ఆరకల్ వేస్తున్న ప్రణాళికలను గురించి ఈ సందర్భంగా ఆమె ప్రధాన మంత్రి కి వివరించారు. అంతే కాకుండా, ఆరకల్ అకాడమి ద్వారా అయిదు లక్షలకు పైగా విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ మెలకువలు నేర్చుకొనేందుకు ఒక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
శ్రీ నరేంద్ర మోదీ తలపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఈ ప్రణాళికలు ఊతం అందించగలవని, ప్రపంచ శ్రేణి తయారీ నిలయంగాను, డిజైన కేంద్రంగాను భారతదేశపు స్థాయిని ఈ ప్రణాళికలు పటిష్టపరచగలవని ఆరకల్ భావిస్తోంది.
ప్రధాన మంత్రి ఈ చొరవలను మెచ్చుకున్నారు.