Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి త‌న ‘కుటుంబం’ – అదే జ‌మ్ము & క‌శ్మీర్ లోని స‌రిహ‌ద్దుల లో గ‌ల సాహ‌సికుల – తో దీపావ‌ళి ని జ‌రుపుకొన్నారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న ఒక‌టో ప‌ద‌వీ కాలం లో మొద‌లుపెట్టిన ఆన‌వాయితీ ని కొన‌సాగిస్తూ ఈ రోజు న దీపావ‌ళి పండుగ ను జ‌మ్ము – క‌శ్మీర్ లోని రజౌరీ జిల్లా లో గ‌ల నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద ఉన్న భార‌తీయ సైన్యాని కి చెందిన సైనికుల తో జ‌రుపుకొన్నారు. మంగ‌ళ‌ప్ర‌ద‌మైనటువంటి ఈ ప‌ర్వ‌దినాన్ని ప్ర‌ధాన మంత్రి జ‌మ్ము – క‌శ్మీర్ లోని సైనిక బ‌ల‌గాల తో జ‌రుపుకోవ‌డం ఇప్పటి కి ఇది మూడో సారి.

ప్ర‌ధాన మంత్రి ర‌జౌరీ లో ‘హాల్ ఆఫ్ ఫేమ్’ ను సంద‌ర్శించి, పూంచ్ మ‌రియు ర‌జౌరీ సెక్ట‌ర్ ల ను కాపాడ‌టానికి ప్రాణాల ను అర్పించిన శూర సైనికుల కు మరియు ధైర్య‌వంతులైన పౌరుల‌ కు శ్ర‌ద్ధాంజ‌లి ని ఘటించారు. ఆయ‌న ‘హాల్ ఆఫ్ ఫేమ్’ను ‘ప‌రాక్ర‌మ భూమి, ప్రేర‌ణ భూమి, పావ‌న భూమి’ అంటూ అభివ‌ర్ణించారు.

ఆ త‌రువాత, ప్ర‌ధాన మంత్రి భార‌తీయ వైమానిక ద‌ళాని కి చెందిన యోధుల‌ ను క‌లుసుకోవ‌డం కోసం ప‌ఠాన్ కోట్ వైమానిక స్థావ‌రాన్ని సంద‌ర్శించారు.

జ‌వానుల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, దీపావ‌ళి పండుగ ను కుటుంబం తో క‌ల‌సి జ‌రుపుకోవ‌డం కోసం ప్ర‌తి ఒక్క‌రు సుదూర ప్ర‌యాణాల కైనా సరే న‌డుం బిగిస్తార‌ని, అదే మాదిరి గా తాను కూడాను త‌న ప‌రివార స‌భ్యుల తో భేటీ కావ‌డం కోసం త‌ర‌లి వ‌చ్చినట్లు వివ‌రించారు.

ప్ర‌ధాన మంత్రి 1947వ సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 27వ తేదీ న సాయుధ ద‌ళాలు చేసిన అత్యున్న‌తమైన‌టువంటి త్యాగాల ను గుర్తు కు తెచ్చుకొన్నారు. ఏటా ఆ రోజు ను ప‌దాతిద‌ళ దినం గా పాటించడం జరుగుతూ వస్తోంది. భార‌తీయ ర‌క్ష‌ణ ద‌ళాల ప‌రాక్ర‌మాన్ని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ఇంత‌వ‌ర‌కు అసాధ్యం అనుకొన్న నిర్ణ‌యాల ను కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొనేట‌ట్లుగా వారు చేశార‌ని చెప్పారు. దేశ భ‌ద్ర‌త ను ప‌రిర‌క్షించ‌డం లో బ‌ల‌గాల యొక్క ధైర్యాన్ని, ధీరోదాత్తత ను ఆయ‌న ప్ర‌త్యేకం గా ప్ర‌స్తావించారు. వారు అందిస్తున్నటువంటి సుప్రతిష్ఠిత సేవల కు గాను దేశ ప్ర‌జ‌ల పక్షాన వారికి తాను ధ‌న్య‌వాదాలు పలికారు.

వారు అందించినటువంటి తోడ్పాటుల కు గుర్తు గా, వారి కి శ్ర‌ద్ధాంజ‌లి ని అర్పించేందుకు ప్ర‌భుత్వం రాజ‌ధాని న‌గ‌రం లో ఒక ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌టువంటి జాతీయ యుద్ధ స్మార‌కాన్ని నెల‌కొల్పేందుకు కృషి చేసింద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. జాతీయ యుద్ధ స్మార‌కాన్ని సంద‌ర్శించే వారి సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతూ ఉండ‌టం సాయుధ బ‌ల‌గాల సేవ‌ ల ప‌ట్ల దేశ పౌరులు కనబరుస్తున్న గౌర‌వాని కి నిద‌ర్శ‌నం గా ఉంద‌ని ఆయ‌న అన్నారు.

భార‌తీయ ర‌క్ష‌ణ బ‌ల‌గాల ఆధునికీక‌ర‌ణ కు మ‌రియు బ‌లోపేతాని కి ప్ర‌భుత్వం తీసుకొంటున్న చ‌ర్య‌ల ను గురించి ప్ర‌ధాన మంత్రి ఒక్కటొక్క‌టి గా వెల్ల‌డించారు. సైనికుల సంక్షేమాని కి పూచీ ప‌డుతూ ప‌లు చ‌ర్య‌ల ను తీసుకొనేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డివుంద‌ని కూడా ఆయ‌న తెలిపారు.