Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి పశ్చిమ బెంగాల్ లో తొక్కిసలాట లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల దు:ఖం వ్యక్తం చేశారు; రూ.2 లక్షల అనుగ్రహపూర్వక చెల్లింపునకు ఆమోదం తెలిపారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల దు:ఖం వ్యక్తం చేశారు.

“పశ్చిమ బెంగాల్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణనష్టం వాటిల్లడం నన్ను దు:ఖితుడిని చేసింది. మృతుల బాధలో నేను పాలుపంచుకొంటున్నాను.

పశ్చిమ బెంగాల్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నాను. వారు త్వరగా కోలుకోవాలిగాక” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

ఈ తొక్కిసలాట లో మరణించిన వారి దగ్గరి బంధువులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 వంతున పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి అనుగ్రహ చెల్లింపులు చేయడానికి కూడా ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు.