Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2020 విజేతల తో ప్ర‌ధాన మంత్రి సంభాషణ


రాష్ట్రీయ బాల పురస్కార్ విజేత లు అందరి కి అనేకానేక అభినందన లు.  ప్రతి ఒక్కరి వద్ద నుండి అభినందనల ను అందుకొని, అందుకొని మీరు అలసిపోయినట్టు తోస్తున్నది.  అభినందన లు మరీ ఎక్కువయిపోయాయి కదూ.  అవి తక్కువ గా ఉన్నాయా లేక ఎక్కువ గా ఉన్నాయా? మంచిది.. ఇక్కడ కు వచ్చేటపుడు, మీ టీచర్ లు మీకు తప్పక చెప్పే వుంటారు- మీరు పూర్తి క్రమశిక్షణ తో ఉండాలి, మరి కాళ్ల ను చేతుల ను కదలాడించవద్దు- అని.  అవునా? .. అది తప్పు.  ఇక్కడ కు వచ్చిన తరువాత మీకు ఏమని అనిపిస్తోంది?  నా ఉద్దేశ్యం, ఈ వాతావరణాన్ని మీరు ఇష్టపడుతున్నారా అనేదే?  రాష్ట్రపతి భవన్ ను మీరు సాంతం చూసేశారా?  మీరు ఇవాళ చూసేది ఏమిటంట..  మొక్కల ను మరియు చెట్లనా?
 
మీలో దిల్లీ కి మొట్టమొదటి సారి గా వచ్చింది ఎంత మంది?  సరే మరి ప్రతి ఒక్కరు ఇంతకు ముందు ఇక్కడ కు వచ్చిన వారూ, ఈ ప్రదేశం తో పరిచయం ఉన్న వారూను.  ఈ ప్రశ్న లు వెనుక పట్టు న కూర్చొన్న వారి కోసం ఉద్దేశించినవి కావు.  ఇవి బాలలు అందరికీ ఉద్దేశించినవి.  వెనుక వైపున ఉన్న వారు మాటల ను అందిస్తున్నట్లుంది.

దిల్లీ కి రావడం అంటే అందులో కొంత ఉత్సాహం దాగివుంది, అయినప్పటికీ మీరు తిరిగి త్వరగా మీ ఇంటి కి చేరుకోవాలనే భావన లో తప్పక ఉండివుంటారనే సంగతి నాకు తెలుసును.  చూడండి, నాకు తెలుసు.. మీరు తప్పక వెంటనే ఇంటి కి పోదలుస్తున్నారు అని;  జరిగిందంతా స్నేహితుల కు చెప్పాలని మీరు కోరుకుంటున్నారు.  వారికి మీ యొక్క పురస్కారాన్ని మరియు ఫొటోల ను చూపాలనుకొంటున్నారు.  దిల్లీ లో మీకు ఎదురైన అనుభూతుల ను గురించి మరియు దిల్లీ లో గల చలిగాలుల ను గురించి వివరించాలనుకొంటున్నారు.  నాతో చెప్పండి మీరు ఆ పని చేయాలని అనుకోవడం లేదా?  ప్రతి ఒక్కరు వారి యొక్క స్నేహితుల కు మంచి అనుభూతుల ను గురించి చెప్పాలని కోరుకొంటున్నారు. 
 
చూడండి, ఈ యాత్ర తాలూకు అనేక కథ లు ఉండి వుంటాయి, వాటి ని చెప్పాలని మీరు తలుచుకొంటున్నారు.  మీరు ఈ విషయాన్ని ఒప్పుకోకపోయినప్పటికీ, మీరు ముందు గా మీ నానమ్మ దగ్గరకు పోయి పూసగుచ్చినట్టు అంతా చెప్పేయాలని తప్పక అనుకొంటూ ఉండివుండవచ్చును.   మరి మీలో కొంతమంది ఇంటి కి పోయి ఇలాగంటారు.. ‘చూడండి, మీరు ఈ పని ని చేయనివ్వలేదు, కానీ ఇప్పుడు మీకు తెలిసివచ్చింది ఏమిటంటే నేను ఒక మంచి పని ని చేస్తున్నాను’ అని. మరి, మీరు ఇప్పుడు ఇంటికి పోయి మమ్మీ ని, డాడీ ని దూషిస్తారా?  మీరు అంటారు కదా – ‘చూడండి, మేము రాష్ట్రపతి తో ఒక ఫొటో ను తీయించుకొన్నాము.  మేము ఒక పురస్కారాన్ని తీసుకువచ్చాము’ అని.  మీరు ఆ పని ని చేస్తారా? మీరు చేయరా? మంచిది, ఆ పని ని రహస్యం గా చేయండి.  మీరు ఆ పని ని చేస్తారా లేక చేయరా?

మీరు మీ యొక్క బాల్యాన్ని పోగొట్టుకొన్నారా? బాల్యావస్థ ను కోల్పోకూడదు;  దానిని పదిలం గా కాపాడుకోవాలి.  మీ యొక్క పసితనం పోయింది.  ఎవరయినా వెళ్లి తమ తల్లితండ్రుల కు అతడి యొక్క/ ఆమె యొక్క అనుభవాన్ని గురించి చెప్పాలి అనిపించలేదు అంటే, ఆ వ్యక్తి యొక్క బాల్యం పోగొట్టుకోబడిందన్న మాటే.  సరే,  మీ అమ్మ నాన్న లు మిమ్మల్ని విడి గా ఒంటరి గా వదలిపెట్టరా?  వారు ఎప్పటికీ మీ వెనుకే ఉంటూవుంటారా? వారు మిమ్మల్ని నమ్మరా?  చిన్న పిల్లలు ఏం చేసుకుంటారో అన్న భయం వారికి ఉండివుండవచ్చు కదూ.  తదుపరి సందర్భం లో వారికి చెప్పండి మిమ్మల్ని ఎక్కడికయినా ఒంటరి గా వెళ్లనివ్వండి అని.

చూడండి, కాసేపటి క్రితం మిమ్మల్ని గురించి నాకు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, నేను నిజం గా ఆశ్చర్యచకితుడినయ్యాను.  అంత లేత ప్రాయం లో మీరు మీ యొక్క ప్రయాసలన్నింటికి ఓర్చి, మరి వేరు వేరు రంగాల లో ఎంతో సాధించారు.  నాకయితే నిజం గానే ఆశ్చర్యమనిపించింది.  మీకు కూడాను రేపటి రోజు న మరేదో చేయాలి అని అనిపించివుంటుంది.  మరిన్ని మంచి పనులు చేయాలనే కోరిక మరియు సుముఖత ఉండే ఉంటాయి. 
 
మరి నేననుకొంటున్నాను ఈ పురస్కారాలు ఇత్యాదులన్నీ ముగింపు కాదు అని.  ఒక రకం గా, ఇది ఆరంభం.  ఎవరైనా గుర్తింపు ను ఇచ్చారంటే, అది మంచిది గా అనిపిస్తుంది.  ఒక విధం గా, ఇది జీవనాని కి ఒక ఆరంభం.  మరి మీరు క్లిష్ట పరిస్థితుల గుండా పోరాడి బయటపడే సాహసాన్ని ప్రదర్శించారు.  మీలో కొందరు ధైర్యవంతులు అయినటువంటి బాలలు.  కొంత మంది జీవనాన్ని సరళతరం చేసేందుకు మరియు ప్రజల ను తీవ్ర వ్యాధుల బారి నుండి కాపాడేందుకు అనేక నూతన ఆవిష్కరణల ను రూపొందించారు.  మరికొందరు కళల లో, సంస్కృతి లో రాణించారు, ఇంకొందరు క్రీడల లో పేరు ను సంపాదించారు, కొంత మంది సామాజిక సేవ లో పేరు ను తెచ్చుకొన్నారు; మీ తోడ్పాటు పూర్తి వైవిధ్యం తో నిండివుంది.  

మీరు మీ యొక్క సంఘం పట్ల, మీ యొక్క దేశం పట్ల మీ విధి ని నిర్వర్తిస్తారు.  ఎర్ర కోట మీది నుండి నేను ఏదో చెప్పాను.  దానిని ఎవరయినా జ్ఞాపకం పెట్టుకొన్నారా?  నేను ఎన్నో అంశాల ను గురించి చెప్పాను.  నేను చెప్పిన వాటి లో ఒకటి ‘కర్తవ్యాని కి ప్రాధాన్యం ఇవ్వండి’ అన్నది.  చాలా వరకు, మనం హక్కుల కు ప్రాధాన్యాన్ని ఇస్తాము.  ప్రస్తుతం మనం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తాలూకు 75 సంవత్సరాలు అయిన వేడుక ను జరుపుకోబోతున్నాము.  మనం ఎంత కాలం పాటు హక్కుల కు ప్రాధాన్యాన్ని ఇస్తూ పోతుంటాము?  ఇప్పుడు మనం కర్తవ్యం పట్ల ప్రాధాన్యాన్ని ఇవ్వడం మొదలు పెట్టాలా లేక మొదలుపెట్టవద్దా? మనం హక్కుల కు లేదా విధి నిర్వహణ కు ప్రాధాన్యాన్ని ఇవ్వాలా?  ఖచ్చితం గా, ప్రతి ఒక్కరు అంగీకరిస్తారా? సరే, మరి ఇవాళ మనం ఒక చట్టాన్ని ఆమోదించాము.      

చూడండి, మీ యొక్క సంఘాన్ని గురించి, దేశం పట్ల మీకు ఉన్నటువంటి కర్తవ్యాల ను గురించి మీకు తెలిసినంతవరకు, మీ తల్లితండ్రులు మాత్రమే కాక మరి మీ యొక్క కుటుంబ సభ్యులు కూడాను, అలాగే మిమ్మల్ని గురించి పరిచయం ఉన్న వారంతా మిమ్మల్ని చూసుకొని గర్విస్తారు. 
 
చూడండి, నేనొక పని ని చేస్తాను; మీ యొక్క కథ ను మీ యొక్క ఫొటో ల తో సామాజిక మాధ్యమం ద్వారా నేను ఇవాళ ప్రపంచాని కి వెల్లడి చేస్తాను.  ప్రతి ఒక్కరి ని గురించి నేను వ్రాస్తాను; పని ని మీరు ఏ విధం గా చేశారనేది, మీరు ఎక్కడ నుండి వచ్చారనేది వగైరా.  అయితే ఏ విషయం లో అయినా ఏదో తప్పు జరిగిందనుకోండి, అప్పుడు కోపం తెచ్చుకోకండి, ఎందుకంటే ఒక్కొక్క సారి సమాచారం లోకి పొరపాటు లు చొరబడిపోవచ్చును.

చూడండి మిత్రులారా, మీరు చాలా చిన్న వయస్సు వారే అయినప్పటికీ, మీకు తెలుసా, మీరు సాధించిన కార్యం విషయానికి వచ్చేటప్పటికి- దాని ని సఫలతపూర్వకం గా పూర్తి చేయడం అటుంచితే- ఎంతో మంది పండితులు ఆ కార్యానికి సంబంధించిన ఆలోచన చేసినంత మాత్రానికే, గందరగోళం లో పడిపోయారు.  మీ లో నూతన ఆవిష్కరణ కు నడుంకట్టిన వారు, మీ టీచర్ తో ఆ విషయాన్ని చెప్పినప్పుడు, టీచర్ ‘నన్ను ఆందోళన కు గురిచేయవద్దు, ఇక్కడి నుండి వెళ్లిపొమ్మ’ని మీతో అని ఉంటారు.  ఈ బాలుడు నాకే పాఠం నేర్పేటంత తెలివిపరుడు అయిపోయాడా అనే ఆలోచన తో ఉపాధ్యాయులు తప్పక కోపం కొనితెచ్చుకొని ఉండివుండవచ్చును.  అలాగ జరుగుతుంది, అవునా?  చూడండి, నేను మీకు ఒకటి చెప్పదలచాను, మీరు మీ యొక్క మిత్రుల కు మరియు ఉపాధ్యాయుల కు దీనిని చెప్పి తీరాలి.  మీరంతా చేసిన ధైర్యం తో కూడిన పనుల ను గురించి విన్నప్పుడల్లా, మరి మీతో మాట్లాడినప్పుడల్లా, నేను కూడా ప్రేరణ ను పొందుతూ ఉంటాను. మీ వద్ద నుండి నేను ఎంతో కొంత నేర్చుకొంటాను.  కాసేపటి క్రితం ఒక పిల్లవాడు నన్ను అడిగాడు – మీరు అన్నేసి పనుల ను చేస్తారు కదా, మీ తల్లి గారి ని గురించి మీరు ఆలోచించరా? అని.  మా అమ్మగారి ని గురించి నేను తలచుకొన్నప్పుడు, అలసట అంతాను మటుమాయం అయిపోతుంది.

మిత్రులారా,

మీ వంటి చిన్నారుల లో దాగివున్న ఈ ప్రతిభ ను ప్రోత్సహించాలనే ఈ యొక్క జాతీయ పురస్కారాల యొక్క పరిధి ని విస్తరించడం జరిగింది.  మరి మీరు స్వీకరిస్తున్న ఈ పురస్కారం కేవలం ఒక పురస్కారం కాదు;  ఈ కార్యక్రమం దేశవ్యాప్తం గా గల ఎందరో ఇతర విద్యార్థుల యొక్క సావధానత ను తన వైపు నకు తిప్పుకొంటోంది.  ఒక రకం గా చూస్తే, వారి కి మీరు కథానాయకులు గా అయిపోయారు;  వారికి ఒక ప్రేరణ గా మీరు మారిపోయారు. జమ్ము- కశ్మీర్ లో, లద్దాఖ్ లో లేదా నాగాలాండ్ లో ఒక చిన్నారి ఉంటాడు; ఆ చిన్నారి గనక కేరళ నుండి వచ్చిన పిల్లవాడి యొక్క గాథ ను విన్నట్లయితే, అతడి కి బాగుంది అని అనిపిస్తుంది.  ఇలా అనిపించడం అంటేనే దీని యొక్క ప్రభావం ఎన్నో గుణిజాలు అధికం అయిపోవడమన్న మాట.  దీని యొక్క అలలు కదలుతూ పోతుంటాయి.  తరంగాలు అట్టడుగు భాగాన్ని నిరంతరం ప్రభావితం చేస్తూ ఉంటాయి; మరి ఈ కారణం గా ఇటువంటి ఘటనల ను ఎన్నటికీ తక్కువ అంచనా వేయనేకూడదు.  వాటికి వాటిదైన ప్రాముఖ్యం ఉంటుంది.  ఒక్కొక్క సారి ఏమవుతుంది అంటే, మన పేరు వార్తాపత్రికల లో అచ్చయినా, మన చిత్రం ప్రచురించబడినా, మనం అహంభావం తెచ్చేసుకొంటూ ఉంటాము.  మేఘాల లోకి ఎగిరిపోయి మరి మన పాదాల ను నేల మీద ఆన్చడానికి ఒప్పుకోము.  అలా అవుతుందా?  అప్పుడు ఇంట్లో మనం ఎటువంటి మాటల ను ఆడుతాము అంటే- చూడు, నన్ను ఏ పని చేయమని అనొద్దు.  నేను జాతీయ పురస్కారం తీసుకొని వచ్చాను.  అలా జరుగుతుందా?  మీరు అటువంటి పని ని చేస్తారా?  లేక మీరు మీ యొక్క పాదాల ను భూమి మీద ఆన్చి ఉంచుకొంటారా?   

చాలా మంది జీవితాల లో రెండు మైలురాళ్లు ఉంటాయి – ఒక వ్యక్తి ప్రతి పని ని ఎంచక్కా ఇట్టే చేసుకుపోతూవుంటారు; మరి ఎప్పుడయితే ఆ వ్యక్తి యొక్క పని గుర్తింపు పొందుతుందో, అప్పుడు తెలిసో లేక తెలియకో అతడు గాని, లేక ఆమె గాని అహంకారి గా మారిపోతారు; ఇక ఆ వ్యక్తి అదే మన:స్థితి లో ఉండిపోతారు; మరి ఇక క్రొత్త గా ఏదీ చేయలేకపోతారు.  అతడు అనుకొంటాడు పని అయిపోయింది; ఫోటో అచ్చయింది; అతడు దిల్లీ కి వచ్చాడు, రాష్ట్రపతి భవన్ ను చూశాడు. ఇకపై ఏమిటి?  జీవనం లో ప్రతిదీ నేరవేర్చుకోవడమైంది.  అంత చిన్నది ఏమీ కాదు జీవితం.

వేరే వాళ్లు ఎవరంటే – ఏదయినా జరిగిందనుకోండి మరి వారు ఎక్కడయినా గుర్తింపు ను తెచ్చుకొంటే గనక, అటువంటప్పుడు వారు దానిని వారి యొక్క ప్రేరణ గా మార్చుకొంటారు.  వారు ప్రతిన లు బూనుతారు, మరింత గా ప్రయత్నాలు చేసేందుకు గాను మార్గాల ను అన్వేషిస్తారు; అలా నూతన శిఖరాల ను అందుకొంటారు.  వారు ఆగరు, ఊఁ, వారు అలసిపోరు.

అటువంటి దురలవాటుల ను మీ జీవనం లోకి ఎన్నటికీ ప్రవేశించనీయరనే నేను ఆశిస్తున్నాను.  ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక ఆరంభం అనే అనుకోండి.  మీకు మీరు చెప్పుకోండి – నేను చేయవలసింది ఇంకా ఎంతో ఉంది అని; దేశాని కి నేను ఇవ్వవలసింది ఎంతో ఉంది అని; ప్రతి ఒక్క విధం గాను నన్ను నేను తయారు చేసుకోవాలి అని.  మీరు గనక ఈ ఉద్వేగాన్ని అనుసరించారూ అంటే అప్పుడు మీరు ఈ యొక్క అవకాశాన్ని ఆస్వాదించగలుగుతారు; మరి మీరు దీని నుండి క్రొత్త గా ఎంతో కొంత నేర్చుకోగలుగుతారు.  అందుకని మీరు నాతో చెప్పండి, మీరు ఏ దిశ గా వెళ్లాలనుకొంటున్నారు?  మీరు ఒకటో దిశ గా వెళ్తారా లేక రెండో దిశ గానా? మీ చేతుల ను పైకి ఎత్తండి – మీలో ఎందరు ఒకటో మార్గం లో వెళ్తారు? సరే, ఇప్పుడు నాతో చెప్పండి, ఎవరు రెండో దిశ గా వెళ్తారు? అంటే నేను చెప్పింది మీరు సరి గా అర్థం చేసుకోలేదు అనుకుంటాను.  నేను ఏమని చెప్తున్నానూ అంటే, ఒకటో దిశ మీరు ఈ యొక్క కార్యసాధన ను ఒక ముగింపు అని భావించడం లేదు అని;  దానికి బదులు గా దీనిని మీరు ఆరంభం గానే భావించాలి అని.  మీ యొక్క పాదాలు నేల ను విడచిపెట్టబోవు, మరి మీరు అహంకారులు గా మారబోరు అని.  మీరు మరేదో సాధించాలి అని సంకల్పించుకొంటారు.. ఇది ఒకటో దారి.  రెండో దారి ఏదీ అంటే – మీరు ఇది చాలు అని భావిస్తారు, మీ ఛాయాచిత్రం వార్తాపత్రికల లో అచ్చయింది, మీరు టీవీ లో కనిపించారు. మరి ఇక మరేదీ సాధించాలి అని మీరు కోరుకోరు అనేది.  అందుకని నాతో చెప్పండి, మీరు ఒకటో దారి ని ఎంపిక చేసుకోవాలనుకుంటారా లేక రెండో దారి నా?  అవశ్యం, చూడండి, నేను ఇంతకు ముందు ఒక పొరపాటు ను చేశాను, అవును కదూ?

సరే, మిమ్మల్ని కొన్ని ప్రశ్నల ను నన్ను అడగనివ్వండి.  రోజు లో నాలుగు సార్లు చెమటోడ్చేది ఎవరు మరి ఏ రుతువు అయినా – చలి కాలాల్లో అయినా లేదా ఎండకాలాల్లో అయినా, తీవ్రం గా చెమటలు కక్కేది ఎవరు? ఒక రోజు లో నాలుగు సార్లు చెమటోడ్చే వారు – మీకు చెమట ఎలా పడుతుంది? అది ఎండ లో నిలబడడం వల్లనా, లేక ఉదయం పూట వ్యాయామం చేసేటప్పుడా? చూడండి, ఏ ఒక్క బాలుడు కూడా ఈ మాదిరి గా ఉండకూడదు.  మీ మీ స్నేహితుల కు కూడా చెప్పండి ఒక రోజు లో నాలుగు సార్లు చెమట రాని పిల్లవాడు ఒక్కరు అయినా ఉండకూడదు అని.  ఎవరో చాలా సంవత్సరాల క్రితం నన్ను అడిగారు – మీ ముఖం లో అంత వెలుగు తెస్తున్నది ఏమిటి? అని.  నేను చాలా సులువైన సమాధానాన్ని చెప్పాను.  నేను అన్నాను కదా – నా శరీరం చాలా చెమట ను కక్కుతుంది అని, నేను కఠోరం గా శ్రమిస్తాను. మరి అదే చెమట తో నేను రుద్దుకుంటాను, అందుకనే ఆ మెరుపు అని.  మంచిది, మీలో ఎంతమంది నీటి ని నిలబడి త్రాగుతారు? మరి కూర్చోకుండానే ఎందుకు నీటి ని త్రాగుతారు.  ఇక్కడ ఎంత మంది ఉన్నారు?  చూడండి, మీరు నీటి ని కూర్చొన్నాక- అప్పుడు త్రాగాలి.  ఇది చాలా చిన్న విషయం.  మీరు ఈ పని ని చేస్తారా?

మంచిది, మీలో ఎంత మంది జలాన్ని ఔషధం లాగా త్రాగుతారు? కొంత మంది ఉండవచ్చు.. వారు నీటి ని ఫలరసం మాదిరి గా సేవించి మరి జల సేవనాన్ని సైతం ఆస్వాదించే వారు.  కాగా మరికొందరు దీనిని ఒక ఔషధం వలె స్వీకరించే వారు కూడా ఉంటారు.  మీలో నీటి ని త్రాగడాన్ని ఆస్వాదిస్తూ, మరి దాని యొక్క  రుచి ని తెలుసుకొని మరీ మజా చేసే వారు ఎంత మంది ఉన్నారు?  మీరు నీళ్ల యొక్క రుచి ని తప్పక ఆస్వాదించాలి.  మరి మీరు దీని ని గనక ఆస్వాదించినట్లయితే నీరు శరీరాని కి ఎంతో లాభాన్ని అందిస్తుంది.  నీళ్ల ను ఔషధం లాగా త్రాగకండి.  మీరు ఆ పని ని చేస్తారా?  మీరు అనవచ్చు – ఏమిటి ఉపయోగం అని? తల్లి చెప్తుంది, వెళ్లు మరి చదువుకో, మీరు త్రాగునీటి ని అయిదు నిమిషాల సేపు త్రాగుతూ ఉన్నాననుకోండి, అప్పుడు ఒక జగడం జరుగుతుంది.  ఒక్కొక్క సారి తల్లి ఒక గ్లాసు లో పాలు తీసుకు వస్తుంది.  అమ్మ కు పని ఉంది, మరి టీవీ లో ధారావాహిక ప్రసారం అవుతూ ఉంది.  అందువల్ల, తల్లి అంటుంది, రా- త్వరగా పాలు త్రాగేసి వెళ్లు అని.  మరి మీరు పాల ను ఔషధం వలె సేవిస్తారు.  దీనికి కారణం మీ అమ్మ గారు ధారావాహిక ను చూడవలసివుంది కదా.  ఇలాగ జరుగుతూ ఉంటుంది, అవునా?  ఆ ధారావాహిక పేరు ఏమిటి?  ‘సాస్ భీ కభీ బహూ థీ’ నా?

ఇవి అన్నీ కూడా ను చాలా చిన్న సంగతులు.  మనం అలవరచుకొనేటటువంటి అలవాటు లు మరి మన చిన్నతనం లో శరీరం లో ఇముడ్చుకొనే అంశాలు మన జీవనం అంతా కూడా అండ గా ఉంటాయి; మరి అవి మన మస్తిష్కం లో పరిపూర్ణం గా అమరిపోతాయి.  దేశం లో ‘ఫిట్ ఇండియా’ అని ఒక ప్రచార ఉద్యమం సాగుతున్న విషయం మీకు తెలుసును.  దాని ని గురించి మీరు ఎరుగుదురా?  మీలో ఎంత మంది కి ఆ విషయం తెలుసును? మరి ఫిట్ ఇండియా కోసం మీరు ఏ దర్జీ దగ్గర కు వెళ్తారు? ఏ టైలర్ చెంతకు మీరు పోతారు? ఫిట్ ఇండియా కోసం దర్జీ కడకు వెళ్లేది ఎవరు? మరి ఎవరైనా ఫిట్ ఇండియా అంటే ఏమిటో ఎలాగ వివరిస్తారు? దీనిని గురించి ఎవరైనా చెప్తారా? ఏ వ్యక్తి అయినా ఏం చేస్తారు? ‘వ్యాయామం’ అని చెప్పినంత మాత్రాన సరిపోదు.  ఎవరో అంటారు –  నేను సూర్య నమస్కారాలు చేస్తాను అని; మరెవరో అంటారు – నేను సైకిల్ ను తొక్కుతాను అని; ఇంకొకరు అంటారు – నేను ఈత కొడతాను అని.  మనము ఏమి చేయాలి?  మంచిది, మీలో ఎంత మంది చెట్టు ను త్వరగా ఎక్కి, తరువాత దిగి రాగలరు?  కుటుంబ సభ్యులు అరవాల్సి వస్తుంది – ‘ఓయ్ దిగి రా, దిగి రా..’ అని; ఆ శ్రేణి లో మీలో ఎందరు ఉన్నారు?

చూడండి, మనం సాహసవంతులమై వుండి తీరాలి.  నేను ఇక్కడ అడుగు పెట్టాను అంటే, నేను పడిపోవచ్చు;  నేను ఇది చేశానంటే, ఏదయినా జరగవచ్చును; సాహసం లేనిదే జీవించడం సాధ్యం కాదు.  మీరు గనక చిన్న చిన్న విషయాల లో ఎదిరించడాన్ని అలవాటు గా మార్చుకొన్నారూ అంటే, అటువంటప్పుడు అది భావి కాలం లో చాలా ఉపయోగకరం గా ఉంటుంది.  మరి మీ వంటి వారు ఆ పని ని చేశారూ అంటే, అటువంటప్పుడు 50 మంది ఇతర వ్యక్తులు దానిని చూసి – ఓ చూడవోయ్, అతడు లేదా ఆమె ఆ పని ని చేశారు.  వారు ఒక పురస్కారం తో విచ్చేశారు, అయినప్పటికీ చాలా కష్టించి పనిచేస్తున్నారు. వారు అంత గౌరవం తో తరలివచ్చినా, ఇంకా ఇప్పటికీ పని చేస్తున్నారు.  అందువల్ల ఏం జరుగుతుంది – చాలా మంది ప్రేరణ ను పొందుతారు.  మీరు ఆ పని ని చేస్తారా? మీరు ఆ పని ని ఖచ్చితం గా చేస్తారా?  అంటే మీరు రేపటి రోజు గడచిపోయిన తరువాత జనవరి 26వ తేదీ కోసం సన్నద్ధులు అవుతారా?  మరి మీకు చాలా అంశాల ను మరియు కార్యాల ను గురించి బోధించి ఉంటారు?  ఆ పని ని కుడి చేతి తో చేయండి? వారు చేయలేదూ? మీరు ప్రజల దిశ గా చేతి ని ఊపవలసివుంటుంది.  ఓహ్, మేము అక్కడ అయిదు మీటర్లు లేదా పది మీటర్ల వరకు మాత్రమే ఉంటాము.  మిగతా ప్రదేశం లో జన సమూహం ఉంటుంది. 

మంచిది, మీతో కాలాన్ని వెచ్చించడం నాకు నచ్చింది.  ప్రస్తుతం, మీరు దిల్లీ లో సాధ్యమైనన్ని యాత్రాస్థలాల ను చూసేసి మజా చేసుకోండి.  విభిన్నమైనటువంటి ప్రదేశాల ను సందర్శించండి.  నేతాజీ సుభాష్ బాబు కోసం, ఇంకా పలువురు ఇతర క్రాంతికారుల కోసం ఎర్ర కోట లో ఏర్పాటు చేసిన ఒక వస్తు సంగ్రహాలయాన్ని గురించి మీకు తెలిసే ఉంటుంది.  దాని ని మీరు చూశారా?  యుద్ధ స్మారకాన్ని మీరు తిలకించారా?, లేదా?. వెళ్లండి మరి యుద్ధ స్మారకాన్ని కూడా వీక్షించండి.  మీ యొక్క స్వరాష్ట్రాని కి చెందిన కొంతమంది సాహసిక మృతవీరుల ను మీరు గనక చూస్తే, వారి పేరు ను చదివి, ఆ పేరుల ను వ్రాసి పెట్టుకొని మరి ఇంటి కి తీసుకుపోవచ్చును.  మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటే గనక అప్పుడు మీరు ఫొటోల ను కూడా తీసుకోవచ్చును.  ఓహ్, ఇది కర్నాటక కు చెందిన ఒక సాహస మృతవీరుని పేరు కదూ, అతడి ఫొటో ను నన్ను తీసుకోనివ్వండి.  ఆ ఫొటో ను మీరు మీ యొక్క స్నేహితుల కు తప్పక చూపించి మరి వారికి ఆ అమరుని యొక్క పేరు ను యుద్ధ స్మారకం లో మీరు చూశారన్న సంగతి ని వారి తో చెప్పండి.  ప్రతి ఒక్కరు అతడి యొక్క లేదా ఆమె యొక్క స్వరాష్ట్రాని కి చెందిన మృతవీరుల ను కనుగొనాలి.  వారి పట్ల మీరు గర్వపడాలి.  ఇక్కడ ఒక పోలీసు స్మారకాన్ని కూడా నిర్మించడమైంది, మీరు వెళ్లి దానిని తిలకిస్తారా?  అక్కడ 33000 మంది కి పైగా పోలీసు మృతవీరులు ఉన్నారన్న సంగతి ని మీరు ఎరుగుదురా?  ఒక్కొక్క సారి ప్రజలు రక్షకభటుల ను ద్వేషిస్తారు, వారు అలా చేయరా?  రక్షక భటులు అంటారు, ‘‘ఇక్కడ నుండి వెళ్లిపోండి; ఇక్కడ సైకిల్ ను అట్టిపెట్టకండి’’ అని.  మీకు కోపం వస్తుంది, అవును కదూ?  33,000 మంది పోలీసులు స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాతి కాలం లో దేశ పౌరుల ను రక్షించే ప్రయత్నాల లో వారి ప్రాణాల ను సమర్పణం చేశారు.  ఈ సంఖ్య చాలా భారీది గా ఉంది- 33,000.  ఇది పోలీసు పట్ల గౌరవ భావాన్ని మరియు ఆదర భావాన్ని ఏర్పరచాలి.  చూడండి, సామాజిక జీవనం లో ఒక పరివర్తన అనేది ఆరంభం అవుతుంది.  మీరు ఎప్పుడు వెళ్లి మరి పోలీసు స్మారకాన్ని చూస్తారు?, మీరు గ్రహిస్తారు ఎంత జరిగిందనేది, మరి వారు అలాగ చేస్తూనే ఉంటారనే విషయాన్ని.  మీరు ఈ పని ని చేస్తారు కదూ? ఖాయం గా?  

మంచిది, మీకు అనేకానేక ధన్యవాదాలూ, అనేక అభినందనలూ ను.

https://youtu.be/dzBuBrzJNuk

**