Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీకి “రవాణా మరియు కమ్యూనికేషన్ ల” పై ఆలోచనలను సమర్పించిన కార్యదర్శుల బృందం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందించిన ప్రోత్సాహం స్ఫూర్తితో, పరిపాలనకు సంబంధించిన వివిధ రంగాలలో పరివర్తనను ఆవిష్కరించే దిశగా భారత ప్రభుత్వానికి చెందిన కార్యదర్శుల బృందం ఈ రోజు వారి వారి రెండో విడత ఆలోచనలను సమర్పించడం మొదలుపెట్టింది.

ఒకటో విడతలో 2016 జనవరిలో ఎనిమిది సమర్పణలను నివేదించడమైంది. ఈసారి ఆ తరహాలో తొమ్మిది సమర్పణలను నివేదించారు.

ఈ రోజు, ఒకటో బృందం “రవాణా మరియు కమ్యూనికేషన్ ల” రంగాలపై వారి అభిప్రాయాలను నివేదించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, ఇంకా నీతి ఆయోగ్ కు చెందిన అధికారులు కూడా పాలుపంచుకొన్నారు.