పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని బంగ్లాదేశ్ హోం మంత్రి శ్రీ అసదుజ్జమాన్ ఖాన్ ఈ రోజు కలుసుకున్నారు.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ లో ఇటీవల ఉగ్రవాద దాడుల కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధాన మంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాడడంలో బంగ్లాదేశ్ కు భారతదేశం మద్దతును కొనసాగగలదని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
భారతదేశం అందిస్తున్న మద్దతుకు, తెలుపుతున్న సంఘీభావానికి శ్రీ అసదుజ్జమాన్ ఖాన్ ప్రధాన మంత్రికి ధన్యవాదాలు పలికారు. బంగ్లాదేశ్ లోని తాజా స్థితిగతులను గురించి ప్రధాన మంత్రికి ఆయన వివరించారు.
Bangladesh Home Minister Mr. Asaduzzaman Khan called on the Prime Minister. pic.twitter.com/tnrtrTUQra
— PMO India (@PMOIndia) July 28, 2016