Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి సైన్య దినం సందర్బంగా భారతీయ సైన్యానికి నమస్కరించారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సైన్య దినం సందర్భంగా భారతీయ సైన్యం యొక్క పరాక్రమానికి మరియు వెలకట్టలేని సేవలకు ప్రణామమాచరించారు.

“సైన్య దినం సందర్భంగా జవానులు, చిరకాల అనుభవం కలిగిన వారికి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు. భారతీయ సైన్యం యొక్క శౌర్యానికి మరియు అమూల్యమైన సేవలకు మేం వందనం ఆచరిస్తున్నాము.

భారతీయ సైన్యం ఎల్లప్పుడూ ముందుండి నాయకత్వం వహిస్తుంది.. అది మన దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం కానివ్వండి, లేదా ప్రకృతి విపత్తుల వేళ దేశ పౌరులను ఆదుకోవడం కానివ్వండి.

మన సైన్యం చేసిన త్యాగాలన్నింటినీ మనం గొప్ప గర్వంతో జ్ఞ‌ప్తికి తెచ్చుకొంటున్నాము. వారు 125 కోట్ల మంది భారతీయులు ప్రశాంతంగా జీవనం సాగించేటందుకు తమ ప్రాణాలను పణంగా పెడతారు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.